అబ్బాయి చేయబోతున్నది బాబాయి ఫ్లాప్‌ సినిమాకు రీమేకా?  

Varuj Tej Doing Sequal Of Pawan Kalyans Plop Movie-jhani Sequal,varuj Tej,varuj Tej Doing Sequal Of Pawan Kalyan,అబ్బాయి బాబాయి ఫ్లాప్‌ సినిమా

గద్దలకొండ గణేష్‌ చిత్రంతో మంచి సక్సెస్‌ను దక్కించుకున్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో సినిమాకు సిద్దం అవుతున్నాడు.ఆ సినిమాతో అల్లు అరవింద్‌ పెద్ద కొడుకు అల్లు బాబీ నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు.

Varuj Tej Doing Sequal Of Pawan Kalyans Plop Movie-Jhani Varuj Kalyan అబ్బాయి బాబాయి ఫ్లాప్‌ సినిమా

చాలా ఆసక్తిగా ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు.ఈ సినిమాలో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు.ఇప్పటికే బాక్సింగ్‌లో మెలుకువలను నేర్చుకునే పనిలో వరుణ్‌ తేజ్‌ పడ్డాడు.ఇలాంటి సమయంలో సినిమా గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ జానీ సినిమా కూడా బాక్సింగ్‌ నేపథ్యంలోనే ఉంటుంది.బాబాయి జానీ సినిమాను ఇప్పుడు అబ్బాయి వరుణ్‌ రీమేక్‌ చేస్తున్నాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పవన్‌ స్వయంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.ఆ సినిమాలో కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ వల్ల సినిమా ఫ్లాప్‌ అయ్యిందని, కాని సినిమా కథ మాత్రం చాలా మంచిగా ఉంటుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తారు.

అందుకే మెయిన్‌ స్టోరీని తీసుకుని దాన్ని కిరణ్‌ విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో నడిపించబోతున్నాడు.అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయ్యిందని అంటున్నారు.

ఎంత మార్చినా కూడా ఫ్లాప్‌ మూవీకి రీమేక్‌ ఏంటీ అంటూ వరుణ్‌ తేజ్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.రీమేక్‌ చేయాలనుకుంటే ఈ అబ్బాయికి బాబాయి సినిమాలు చాలానే ఉన్నాయి.

వాటిని చేసుకోవచ్చు కదా అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

Varuj Tej Doing Sequal Of Pawan Kalyans Plop Movie-jhani Sequal,varuj Tej,varuj Tej Doing Sequal Of Pawan Kalyan,అబ్బాయి బాబాయి ఫ్లాప్‌ సినిమా Related....