అత్యాచారాలకు కారణం ఆమెనే అట!

ఇటీవల ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేకమంది అనేక విధాలుగా స్పందిస్తున్నారు.కాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్ మాత్రం ఆడవారి ఆగ్రహానికి గురైంది.

 Nidhi Aggarwal Reason For Rapes Says Netizen-TeluguStop.com

ఇంతకీ అతగాడు ఏమని కామెంట్ చేశాడనేగా మీ సందేహం.సమాజంలో ఆడవారిపై జరుగుతున్న హత్యాచారాలకు కారణం ఓ ప్రముఖ నటియే అంటూ చెప్పుకొచ్చాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన నిధి అగర్వాల్ రెచ్చిపోయి అందాల ఆరబోత చేయడంతో ఆ సినిమాతో ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు.కాగా ఆ సినిమాలో నిధి అగర్వాల్ అలా రెచ్చిపోవడంతోనే సమాజంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇది చూసిన ఆమె అవాక్కయ్యింది.సమాజంలో ఇలా ఆలోచించే వారు ఉన్నారని తాను ఊహించలేదని అంటోంది.

Telugu Netizen, Nidhi Aggarwal-

సదరు నెటిజన్‌ను తన చిరునామా పంపాలని, తనకు పింక్ సినిమాను పంపుతానని, అది అతడికి చాలా అవసరమంటూ బదులిచ్చింది.నిధి చేసిన ట్వీట్‌కు పలువురు నెటిజన్ల వద్ద నుండి ప్రశంసలు వస్తున్నాయి.రేపులు చేస్తున్న మానవమృగాలు అలాంటి ఫోటోలు చూసినా చేస్తారు, చూడకపోయినా చేస్తారంటూ మనోడిని బాగానే ఏసుకుంది.ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube