యూకేలో చదువుకునేందుకు భారతీయుల ఆసక్తి: స్టడీ వీసాల్లో 63 శాతం పెరుగుదల

యూకేలో విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్ధులకు ఇస్తున్న స్టడీ వీసాల జారీలో ఏడాది నుంచి పెరుగుదల నమోదైనట్లు యూకేకు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ చెబుతోంది.నవంబర్ 28న ప్రచురించిన ఈ నివేదిక ప్రకారం 2019 సెప్టెంబర్‌తో ముగుస్తున్న ఆర్ధిక సంవత్సరానికి 30,550 మంది భారతీయ విద్యార్ధులు టైర్-4 స్టడీ వీసా పొందారని, అంతకుముందు ఏడాది 18,730 మందికి వీసాలు జారీ అయ్యాయి.

 Student Visas From India To America-TeluguStop.com

బ్రిటీష్ ప్రభుత్వం ప్రతి ఏటా 2,76,889 స్పాన్సర్డ్ స్టడీ(టైర్-4) వీసాలు మంజూరు చేస్తుంది.2011 నుంచి ఒకే ఏడాదిలో ఇదే అత్యధిక స్థాయి.భారతీయులతో పాటు చైనా విద్యార్ధులకు మంజూరు చేసిన స్టూడెంట్ వీసాలలోనూ పెరుగుదల నమోదైంది.అక్టోబర్ నాటికి 1,19,697 మంది చైనీయులు వీసాలను పొందారు.ఇదే సమయంలో ఈఈఏ కానీ టైర్-4 వీసాలలో చైనీయులు 43 శాతం, భారతీయులు 11 శాతం పొందారు.గడచిన పదేళ్లలో 2,70,000 పైగా భారతీయులు యూకేలో చదువుకునేందుకు ఎన్‌రోల్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Telugu Hb Visa, Visas India, Visa Usa, Telugu Nri Ups, Uk Witnesses-

ప్రపంచంలోని పది అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మూడు యూకేలోనే ఉండటం, మంచి వాతావరణం కారణంగా ఆ సంస్థల్లో అడ్మిషన్లకు పోటీ ఎక్కువగా ఉందని యూకే విదేశాంగ శాఖ చెబుతోంది.అలాగే భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తున్న విదేశాల్లో యూకే ముందు వరుసలో ఉంది.గత సంవత్సరం 5,12,000 మంది భారతీయులు యూకే విజిటింగ్ వీసాను పొందారని నివేదిక చెబుతోంది.

Telugu Hb Visa, Visas India, Visa Usa, Telugu Nri Ups, Uk Witnesses-

మొత్తం మీద యూకే వీసా పొందుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయుడే ఉంటున్నారు.అలాగే భారతీయుల వీసా దరఖాస్తుల్లో 90 శాతం వరకు సక్సెస్ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మంజూరు చేసిన మొత్తం టైర్-2 వీసాల్లో భారతీయులు 51 శాతం వాటా కలిగివున్నారు.నైపుణ్యం కలిగిన వర్క్ వీసాలను 56,000 మంది భారతీయులు అందుకున్నారు.టైర్-4 వీసాలతో పాటు గతేడాది 1,18,172 షార్ట్ టర్మ్ స్టూడెండ్ వీసాలు సైతం మంజూరు చేయబడ్డాయి.ఇది గతేడాదిత పోలిస్తే 4 శాతం ఎక్కువ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube