ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డిఫరెంట్ ఛాలెంజ్ లో అందుబాటులోకి వచ్చాయి.వాటిలో కొన్ని సామాజిక బాధ్యతగా కూడా చేస్తున్నారు.
తాజాగా ఇండియాలో సేవ్ ట్రీ ఛాలెంజ్ బాగా పాపులర్ అయ్యింది.దీనిని చాలా మంది సెలబ్రెటీలు స్వీకరిస్తూ పర్యావరణ పరిరక్షణలో సామాజిక బాధ్యతగా వారు కూడా పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా క్రికెట్ ఆల్ రౌండర్ కల్లిస్ తాజాగా సగం గెడ్డం, సగం సేవింగ్ లుక్ తో కనిపించాడు.ఈ లుక్కాస్తా డిఫరెంట్ గా కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే కల్లిస్ ఈ లుక్ వెనుక ఒక కారణం ఉంది.
ఇది కూడా సోషల్ మీడియాలో ఒక చాలెంజ్‌లో భాగంగా సగం గడ్డం, సగం మీసంతో కనిపించాడు.
దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాల సంరక్షణలో భాగంగా ‘సేవ్ ద రైనో’ చాలెంజ్‌ను స్వీకరించిన కల్లిస్ ఈ రకంగా అలరించాడు.తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కల్లిస్ ఫోటోను పోస్ట్ చేయగా, అందుకు పాజిటివ్‌గా కామెంట్లు వస్తున్నాయి.
కల్లిస్ కొత్త లుక్‌లో అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.ఇక అతని డేరింగ్ కూడా చాలా మంది మెచ్చుకుంటుంన్నారు.
మొత్తానికి ఛాలెంజ్ లో స్వీకరించడంలో ఇప్పుడు సెలబ్రెటీలు చాలా స్పీడ్ గా ఉన్నారని ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది.