అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్ధులు అరెస్ట్..!!!

అమెరికాలో మరో సారి ఫేక్ యూనివర్సీటీ భాగోతం వెలుగు చూసింది.గత మార్చి నెలలో ఇదే తరహాలో ఫేక్ యూనివర్సిటీ ని కనుగొన్న అధికారులు ఆ సమయంలో యూనివర్సిటీ లో ఉన్న సుమారు 161 మంది విద్యార్ధులని అరెస్ట్ చేశారు.

 Students Mostly From Indians-TeluguStop.com

ఆ తరువాత వర్సిటీ మూసివేసే సమయానికి 600 మంది విద్యార్ధులని అరెస్ట్ చేయగా వారిలో అత్యధికులు భారతీయ విద్యార్ధులు కావడం గమనార్హం.ఇదిలాఉంటే.

తాజాగా మరొక ఫేక్ యూనివర్సిటీ అమెరికాలో వ్యవహారం బయటపడింది.డెట్రాయిట్ లోని ఫార్మింగ్ టన్ అనే యూనివర్సిటీ ఫేక్ గా గుర్తించిన ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ కస్టమ్స్ అధికారులు అందులో చదువుతున్న 250 మందిని అరెస్ట్ చేశారు.

అయితే అందులో 90 మంది భారతీయ విద్యార్ధులుఉన్నారని అధికారులు తెలిపారు.

Telugu Visa, Indians, Telugu Nri Ups-

అమెరికాలో ఉన్నత విద్యలు చదవడానికి ఎన్నో ఆశలతో వెళ్ళిన తమ పిల్లలని అరెస్ట్ చేయడం ఎంతో దారుణం అంటూ విద్యార్ధుల తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు.అయితే గతంలో కూడా ఇదే తరహాలో అరెస్ట్ లు జరిగినపుడు ఫేక్ యూనివర్సిటీ లని ప్రభుత్వం ఎందుకు గుర్తించడంలేదంటూ డెమోక్రటిక్ పార్టీ నేతలు అధికారులపై మండిపడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube