తమిళ అర్జున్‌ రెడ్డిపై డాక్టర్లు ఫైర్‌

తెలుగు సూపర్‌ హిట్‌ మూవీ ‘అర్జున్‌ రెడ్డి’ని హిందీలో కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ చేయగా, తమిళంలో ఆధిత్య వర్మగా రీమేక్‌ చేశారు.ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

 Tamil Doctors On Aditya Varma Movie-TeluguStop.com

ముఖ్యంగా తమిళంలో అసలు ఈ చిత్రం విడుదల అవుతుందా, విడుదల అయినా కూడా సినిమా సక్సెస్‌ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాని సినిమా అనూహ్యంగా సూపర్‌ హిట్‌ అయ్యింది ఆధిత్య వర్మతో ధృవ్‌ హీరోగా స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ విక్రమ్‌ అభిమానులు చాలా ధీమాగా ఉన్నారు.

ఆధిత్య వర్మ సినిమా అన్ని అవాంతరాలు దాటుకుని విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలాంటి సమయంలో సినిమాకు డాక్టర్లు అభ్యంతరం చెబుతున్నారు.ఈ సినిమాలో డాక్టర్లను చిన్న చూపు చూసే విధంగా సీన్స్‌ ఉన్నాయంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జనాలు ఈ సినిమా చూసిన తర్వాత డాక్టర్లను నమ్మే పరిస్థితి ఉండదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాగి డాక్టర్లు ఎవరైనా వైధ్యం చేస్తారా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.ఈ సినిమాలో వైధ్యులను తాగుబోతులుగా చిత్రీకరించడంతో పాటు వారిపై బ్యాడ్‌ ఇంప్రెషన్‌ కలిగేలా చేశారంటూ తమిళ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాను బ్యాన్‌ చేయాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube