ఆదర్శం : జీరో మార్కులు, మరోవైపు క్యాన్సర్‌ అయినా శాస్త్రవేత్తగా నిలిచింది

ఆత్మ విశ్వాసం పట్టుదల ఉంటే ఏమైనా సాధ్యం, ఏదైనా సాధ్యమే అంటూ మరోసారి నిరూపితం అయ్యింది.చదువులో జీరో మార్కులు సాధించిన విద్యార్థులు ఆ తర్వాత కష్టపడి చదువు విలువ తెలుసుకుని పట్టుదలతో లక్ష్యం వైపు దూసుకు పోతే విజయాన్ని సాధించిన దాఖలాలు మనం చాలా చూశాం.

 Sundar Pichai Is Inspired By Woman Who Scored 0 In Quantum Physics Exam-TeluguStop.com

ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు అలా ముందడుగు వేసిన వారే.మొదట చదువు బాగా రాకున్నా కూడా గురువులు చెప్పిన పాఠాలను బాగా తలకెక్కించుకుని ఉన్నత విద్యావంతులు అయ్యారు.

Telugu Quantum Physcis, Sarfinananns, Sarfina Nans, Sundar Pichai, Sundarpichai-

ఇప్పుడు నేను చెప్పబోతున్న మహిళ కూడా జీరో మార్కుల స్థాయి నుండి పట్టుదలతో ఏకంగా శాస్త్రవేత్తగా మారబోతుంది.ఆమె పట్టుదలకు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచ్చై నుండి ప్రముఖులు ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆమె పేరు సరఫినా నాన్స్‌.ప్రస్తుతం ఈమె ఫిజిక్స్‌ లో పీహెచ్‌డీ చేస్తోంది.ఇప్పటికే రెండు పరిశోదన బుక్స్‌ను కూడా ప్రచురించింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిజిక్స్‌ మేధావుల్లో ఆమె ఒకరుగా నిలిచింది.

Telugu Quantum Physcis, Sarfinananns, Sarfina Nans, Sundar Pichai, Sundarpichai-

ప్రస్తుతం ఫిజిక్స్‌ శాస్త్రవేత్తగా గుర్తింపు దక్కించుకున్న సరఫినా నాన్స్‌ నాలుగు సంవత్సరాల క్రితం క్వాంటం ఫిజిక్స్‌ పరీక్షలో జీరో మార్కులు వచ్చాయి.దాంతో ఫిజిక్స్‌ను వదిలేయాలనుకుంది.తన ప్రొఫెసర్‌ వద్దకు వెళ్లి తాను ఫిజిక్స్‌ను వదిలేయాలనుకుంటున్నట్లుగా చెప్పిందట.ఆ సమయంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తి మరియు మోటివేషన్‌తో కష్టపడింది.ఆ సమయంలోనే ఆమెకు క్యాన్సర్‌ అని కూడా తేలింది.క్యాన్సర్‌ మొదటి దశలో ఉండగానే ఆమె చికిత్స మొదలు పెట్టింది.

మరో వైపు ఫిజిక్స్‌పై యుద్దం చేసింది.ఒక వైపు ఫిజిక్స్‌ మరో వైపు క్యాన్సర్‌ను ఆమె జయించింది.

ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌ను పూర్తిగా జయించడంతో పాటు ఫిజిక్స్‌లో శాస్త్రవేత్త అయ్యింది.మనో ధైర్యంగా ఆమె పోరాడిన తీరుకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.

విద్యార్థులు అంతా కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది.కష్టాల్లో ఉన్నామని.

కష్టంగా ఉందని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయవద్దని సరఫినా నాన్స్‌ జీవితాన్ని బట్టి తెలుసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube