లోకేష్ ఆశ తీరేనా ? ఆ తప్పులు సరిచేసుకుంటాడా ?

తనను తాను బలవంతుడిగా నిరూపించుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.వయసు రీత్యా చంద్రబాబు మరో రెండు మూడు సంవత్సరాల్లో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునే పరిస్థితి ఉండటం, ఆ తర్వాత పార్టీని తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉండడంతో లోకేష్ రాజకీయంగా తాను బలవంతుడని అని నిరూపించుకోవలసిన సమయం వచ్చేసినట్టుగా భావిస్తున్నారు.

 Nara Lokesh Comparison With Jagan Mohan Reddy-TeluguStop.com

అధికార పార్టీ వైసీపీ మీద యుద్ధం చేసేందుకు ఆయన సోషల్ మీడియానే ఇప్పటికీ వాడుకుంటున్నాడు.ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ట్విట్టర్ ద్వారా మాత్రమే లోకేష్ స్పందిస్తున్నాడు.

కానీ ఆయన జనాల్లోకి పెద్దగా రాలేక పోతున్నాడు.

Telugu Apcm, Janasenapawan, Lokesh, Rajashekarreddy, Tdpchandrababu, Ycp Jagan-

ఇదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనాల్లో తిరుగుతూ తన పార్టీని బలపరచు కుంటున్నాడు.లోకేష్ మాత్రం తనను జగన్ తో పోల్చుకుంటూ ముందు ముందు ఆయనతో తలపడాల్సిన పరిస్థితులను ఊహించుకుంటున్నాడు.లోకేష్, జగన్ రాజకీయ జీవితాల గురించి చెప్పుకుంటే లోకేష్ వచ్చినంత ఈజీగా జగన్ రాజకీయ జీవితం లేదు.

జగన్ ఎంపీగా గెలిచిన కొన్ని నెలలకే రాజశేఖర్ రెడ్డి మరణించారు.ఆ తర్వాత కాంగ్రెస్ తో విభేదించిన జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.దేశంలోనే రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి సంచలనం సృష్టించారు జగన్.కానీ లోకేష్ మాత్రం ప్రజాక్షేత్రంలో తలపడకుండానే ఎమ్మెల్సీగా, మంత్రిగా పని చేశారు.

దొడ్డిదారిన మంత్రి అయ్యారు అంటూ అంతా ఆయనను విమర్శిస్తూ ఉండటంతో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

Telugu Apcm, Janasenapawan, Lokesh, Rajashekarreddy, Tdpchandrababu, Ycp Jagan-

ఈ విషయంలో జగన్ ను పోల్చిచూస్తే లోకేష్ అట్టడుగు స్థాయిలోని ఉన్నట్టు అర్థం అవుతోంది.దీని ద్వారా లోకేష్ తాను బలహీనుణ్ణి అనే విషయాన్ని బయటకు చెప్పుకున్నారు.ఇది ఒక రకంగా లోకేష్ రాజకీయంగా చేసిన అతి పెద్ద తప్పుగానే కనిపిస్తోంది.

అదే 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి ఉంటే ఓటమి నింద ఆయన మీద పడేది కాదు.జరిగిందేదో జరిగింది అనుకుంటే ఇప్పుడు కూడా లోకేష్ ప్రజల్లో బలం పెంచుకునే విధంగా వ్యవహరించడం లేదు.

కేవలం ట్విట్టర్ ద్వారానే రాజకీయం నడిపిద్దాం అంటే అది జరగని పని.మాస్ లీడర్ గా, క్లాస్ లీడర్ గా ఇలా అన్ని రకాల ముద్రలు వేయించుకుంటేనే రాజకీయంగా నిలదొక్కుకునే పరిస్థితి ఉంటుంది.అలా కాకుండా తన తండ్రి ఇమేజ్ మీదే ఆధారపడి రాజకీయం చేద్దామంటే ముందు ముందు రాజకీయంగా వెనకబడిపోవడానికి లోకేష్ సిద్దమవుతున్నట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube