టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా ఎందుకో ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ కాలేదు.దీంతో ఫుల్ స్పీడుతో దూసుకెళుతున్న విజయ్‌కు బ్రేక్ పడినట్లు అయ్యింది.
ఆ తరువాత నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తా అనే సినిమాను తెరకెక్కించాడు.అది కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తోన్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.ఈ సినిమాపై విజయ్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది.నవంబర్ చివరికల్లా షూటింగ్ పూర్తి చేసుకుని, ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ సినిమాలో విజయ్ లవర్ బాయ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
మూడు విభిన్న షేడ్స్‌లో నటించనున్న విజయ్ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ త్రేసా, ఇజాబెల్ లెయిట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాను సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు ప్రొడ్యూ్స్ చేస్తుండగా, క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు.రౌడీగా పేరొందిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో లవర్ బాయ్‌లా ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే లవర్స్ డే వరకు ఆగాల్సిందే.