టైమ్ మ్యాగజైన్‌పై నకిలీ కవర్ ఫోటో... సీవీలో తప్పుడు సమాచారం: మహిళా అధికారి రాజీనామా

విద్య, వృత్తిలో అనుభవానికి సంబంధించిన విషయాలపై సీవీలో తప్పుడు సమాచారం ఇచ్చిన అభియోగాలపై అమెరికా ప్రభుత్వాధికారిణి తన పదవికి రాజీనామా చేశారు.వివరాల్లోకి వెళితే.35 ఏళ్ల మినా చాంగ్ బ్యూరో ఆఫ్ కాన్ల్ఫిక్ట్ అండ్ స్టెబిలైజేషన్ ఆపరేషన్స్ (సీఎస్‌వో)లో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.అయితే ఆమె విద్యార్హత, వృత్తి అనుభవానికి సంబంధించి సీవీలో తప్పుడు వివరాలను పొందుపరిచారని ప్రముఖ మీడియా సంస్థ ఎన్‌బీసీ న్యూస్ కథనాలు ప్రచురించింది.

అందులో ప్రధానమైనవి:


 Mina Chang Amid Nflated-TeluguStop.com

* ఆమె ఫోటోతో నకిలీ టైమ్ మ్యాగజైన్ కవర్‌ను సృష్టించడం
* హవాయి విశ్వవిద్యాలయంలో లేని డిగ్రీని చదివినట్లు చూపించడం
* డెమెక్రాటిక్ మరియు రిపబ్లికన్ సమావేశాల్లో ప్రసంగించడం

Telugu Cv, Mina Chang, Telugu Nri Ups, Officialmina-

ఈ ఆరోపణలపై స్పందించిన చాంగ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.రాజీనామా లేఖలో తనపై వచ్చిన అన్ని అభియోగాలను ఆమె ఖండించారు.నిరాధారమైన ఆరోపణలతో తన వ్యక్తిత్వాన్ని ఖూనీ చేశారని మినా ఆరోపించారు.ఈ వ్యవహారంలో తన పై అధికారులు సైతం తనకు మద్ధతుగా నిలబడలేదని ఆమె ఆవేదనం వ్యక్తం చేశారు.

Telugu Cv, Mina Chang, Telugu Nri Ups, Officialmina-

రాజీనామా చేసినందున తాను తలొగ్గానని కాదని.దీనిని ఒక నిరసనగా చూడటం చాలా అవసరమని చాంగ్ పేర్కొన్నారు.ఎందుకంటే దేశానికి సేవ చేయాలనే నా నిబద్ధతను, సత్యానికి ఉన్న విశ్వసనీయతను మరొకరికి అప్పగించనన్నారు.స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతమున్న వాతావరణం అత్యంత విషపూరితమైనదని చాంగ్ అభివర్ణించారు.త్వరలోనే అది అత్యంత ఘోరమైన నైతిక సంక్షోభాన్ని ఎదుర్కొనుందని మినా చాంగ్ జోస్యం చెప్పారు.మరోవైపు చాంగ్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విభాగం ఇప్పటి వరకు స్పందించలేదు.

చాంగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎస్‌వో పదవిని చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube