నరసాపురం ఎంపీ బీజేపీలోకి జంప్ చేస్తున్నారా ?

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైపు అంతా అనుమానంగా చూస్తున్నారు.కొద్దిరోజులుగా ఆయన వైసీపీ విషయంలో లెక్కచేయనట్టుగా ప్రవర్తిస్తూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఆయనపై సహజంగా అనుమానాలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది.

 Narasapuram Mp Raghu Rama Krishnam Raju Jump In Bjp Party-TeluguStop.com

వైసీపీ అధిష్ఠానం తనకు తగిన గౌరవం, ప్రాధాన్యం ఇవ్వలేదామేలడంటూ అసహనంగా ఉన్నారట.దీనికి తోడు ఆయన ప్రధాన అనుచరులంతా తాము పార్టీలో ఇమడలేమంటూ బీజేపీలోకి వెళ్తామంటూ ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.

రఘురామ కృష్ణం రాజు పార్టీ మరలనుకుంటున్న విషయం వైసీపీ కి కూడా ఇప్పటికే సమాచారం ఉంది.అందుకే ఆయన పార్టీ మారకుండా ఉండేలా ఆయనతో మంతనాలు సాగిస్తున్నారు.

ఇక ఈ ఎంపీ కూడా జగన్ మాటలను లెక్కచేయడంలేదట.మొన్నటి పార్లమెంటరీ పార్టీ భేటీలో జగన్ హెచ్చరించిన ఎంపీల్లో రఘురామకృష్ణంరాజు కూడా ఒకరని తెలుస్తోంది.

Telugu Schoolstelugu, Schoolsenglish, Mithun Reddy, Sapurammp, Raghurama, Vijay

ఇక ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.దీనిని పార్టీ నాయకులంతా సమర్థిస్తున్నారు.అయితే నరసాపురం ఏపీ రఘురామకృష్ణం రాజు మాత్రం తెలుగును కాపాడాలంటూ పార్లమెంట్‌లో గళమెత్తారు.మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.మాతృభాషా పరిరక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 350, 350ఎ అధికరణాల స్ఫూర్తి దెబ్బతినకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని రఘురామరాజు కోరారు.ఇది వైసీపీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

రఘురామకృష్ణంరాజు ఎంపీగా ఎన్నికైన తర్వాత రెండు,మూడు సార్లు ప్రధానమంత్రిని కలిశారు.దానికి పార్టీ పర్మిషన్ తీసుకోలేదు.

కేంద్రమంత్రులతో దగ్గరి సంబంధాలు ఏర్పర్చుకున్నారు.వారికి విందులు కూడా ఇస్తున్నారు.

Telugu Schoolstelugu, Schoolsenglish, Mithun Reddy, Sapurammp, Raghurama, Vijay

ఈ క్రమంలోనే ఆయనకు ఓ విభాగంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి కూడా వచ్చింది.వాస్తవానికి ఆయన పేరును వైసీపీ సిఫార్సు చేయలేదు.విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిల పేర్లను మాత్రమే.జగన్ సిఫార్సు చేశారు.వారిద్దరితో పాటు రఘురామకృష్ణంరాజుకు కూడా పదవి ప్రకటించారు.దీంతో వైసీపీ లో రఘురామ కృష్ణం రాజు మీద మరింత అనుమానం పెరిగిపోయింది.

ఇక వైసీపీ తీరు ఈ ఎంపీ గారికి కూడా నచ్చడంలేదట.ఢిల్లీలో ఏ అధికారిని కలవాలన్న పార్టీ అధినేత లేదంటే ముఖ్య నేతలుగా చెలామణి అవుతున్న కొద్దిమందికి సమాచారం ఇవ్వాల్సి రావడం ఈయనకు నచ్చడంలేదట.

ప్రస్తుతం టీడీపీ నుంచి నాయకులు వైసీపీ వైపు వస్తుంటే, వైసీపీ నుంచి ఈయన బీజేపీలోకి వెళ్లడం వల్ల అనవసర గందరగోళం నెలకొనడంతో పాటు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలనే భయం వైసీపీ అగ్ర నాయకుల్లో కనిపిస్తోంది.అందుకే ఆయన పార్టీ మారకుండా చేసేందుకు ఆయనతో మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube