ఆలీ కాట్రవల్లీ మొదలుపెట్టాడా ? జగన్ పట్టించుకోవట్లేదా ?

ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అహర్నిశలు పనిచేస్తూ గెలుపులో భాగస్వామ్యం అయిన నాయకులంతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడలేని సంతోషం వ్యక్తం చేశారు.ఇక తమకు పదవులు తక్కడమే తరువాయి అనుకుంటూ రోజులు లెక్కపెట్టుకుంటూ ఉన్నారు.

 Comedian Ali Starts Katravalli In Ysrcp-TeluguStop.com

అయితే పదవుల పంపకంలో జగన్ లెక్కలు జగన్ కి ఉన్నాయి.అందుకే ఎక్కడా తొందరపడకుండా పదవుల భర్తీ చేపట్టాడు జగన్.

పార్టీ ప్రతిపక్షంలో ఉండగా తన వెంట నడిచి అనేక ఇబ్బందులకు గురయిన వారు చాలామంది ఎమ్యెల్యేలు గా ఎన్నికయ్యారు.అయితే వారిలో చాలామందికి మంత్రి పదవులు దక్కకపోవడంతో అంతా షాక్ అయ్యారు.

అయితే వారందరికీ నామినేటెడ్ పోస్ట్ లు ఇస్తున్నారు.జగన్ ఇక ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా పార్టీ కోసం పనిచేసిన వారికీ, ముందు నుంచి తన వెంట ఉన్నరావారికి పదవులు కట్టబెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ పదవిని అప్పగించగా, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవిని సీనియర్ నటుడు విజయ్ చందర్‌కు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట.జగన్ జైలులో ఉన్న సమయంలో, షర్మిల పాదయాత్ర సమయంలో, ఎన్నికల ప్రచారంలో ఇలా అన్నింటా వైఎస్ ఫ్యామిలీకి అండగా నిలబడిన నేపథ్యంలో ఈ పదవి ఆయనకు దక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Telugu Vijay Chander, Ali, Janasena, Jayasudha, Katravalli, Pawankalyan, Sharmil

ముఖ్యంగా ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సినీ ప్రముఖులు పోసాని, మోహన్ బాబు, అలీ, జయసుధ ఈ పదవిని ఆశించిన వారి లిస్ట్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.కానీ వీరందరిని పక్కనపెట్టి సీనియర్‌ విజయ్ చందర్‌కు ఆ పదవి ఇవ్వడంతో వారందరూ లోలోపల బాధపడుతున్నారట.ముఖ్యంగా ఈ విషయంలో అలీ బాగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.గతంలో టీడీపీకి మద్దతుగా ఉండే అలీ ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకున్నాడు.ఇక వైసీపీలో చేరే సమయంలో పార్టీ కోసం పనిచేయి నీ సంగతి నేను చూసుకుంటాను అంటూ జగన్ హామీ ఇచ్చారని అలీ అప్పట్లోనే చెప్పుకున్నారు.దీనికోసమే జనసేన అధినేత పవన్ కి కూడా అలీ దూరం అయ్యారు.

ఇక ఇప్పుడు పార్టీ అదికారంలో ఉన్నా జగన్ తనను పెద్దగా పట్టించుకోకపోవడం ఆలీకి ఆగ్రహం తెప్పిస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube