మహారాష్ట్రలో కీలక పరిణామం

మహారాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు మార్పు వస్తూనే ఉంది.నిన్నటితో ముఖ్యమంత్రి పడ్నవీస్‌ పదవి కాలం పూర్తి అవ్వడంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది.

 Latestupdate Of Maharastra Political Issue-TeluguStop.com

ఆయన రాజీనామా తర్వాత గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశియారీ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు తనవంతు ప్రయత్నం అన్నట్లుగా మొన్నటి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకుని అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాడు.

ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావాలంటూ ఈ సందర్బంగా గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశియారీ ఒక లేఖను బీజేపీ పార్టీ నాయకత్వంకు అందించినట్లుగా సమాచారం అందుతోంది.

అయితే బీజేపీకి సరైన బలం లేకపోవడంతో ఇన్ని రోజులు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవ్వలేదు.అయితే టెక్నికల్‌గా ఇప్పుడు గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన కారణంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆ తర్వాత బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.అప్పటి వరకు ఏదైనా జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube