కుర్ర హీరోలకు ధీటుగా, చిరంజీవి జిమ్ లో కసరత్తులు..

మెగా స్టార్ చిరంజీవి జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన మనిషి.ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్త్రిలో ఒక్కోమెట్టు ఎక్కుతూ తెలుగు ప్రజల అభిమానం మరియు అభిమానులను సంపాదించుకుని మెగా స్టార్ గా ఎదిగాడు.

 Mega Star Chiranjivi In Gym-TeluguStop.com

అతని అభిమానుల గుండెల్లో మాత్రం అన్నయ్య గా చెరగని ముద్ర వేసుకున్నాడు.ఇప్పుడున్న యువ హీరోలతో పోటి పడి మరీ సినిమాలు చేస్తున్నాడు.

తాజాగా అయన నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి.ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయి లాగా నిలిచిపోతుంది.

బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను చిరంజీవి తిరగరాశాడు.

Telugu Chiranjivi, Chiranjivi Gym, Ram Charan, Ramcharan-

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చెయ్యడానికి అంగీకరించాడు.ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.ఈ చిత్రం కోసం మెగా స్టార్ జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నాడు.

అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది.చిరంజీవి అభిమానులు మాత్రం… అన్నయ్య మీరు ఇప్పటి హీరోలకు మరియు మాలాంటి అభిమానులకు ఆదర్శం, అలాగే మీ డెడికేషన్, పని పైన ఉన్న శ్రద్ద మాలాంటి యువతకు ఆదర్శం అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పొగడత్తలతో ముంచెత్తుతున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్ నుండి ఓ సామజిక కార్యకర్తగా ఓ ముప్పై ఏండ్ల కుర్రాడిలాగ చిరంజీవి కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube