ఇదేమి రాజకీయం 'గోవిందా' ? పరువు తీస్తున్నారే ?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో అందరికి తెలిసిందే.హిందువులకు పరమ పవిత్రమైన స్థలంగా ఇది ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

 Ycp Silent In Ttd And Ramanadikshithulu-TeluguStop.com

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయమైన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర సంస్థ టీటీడీ.ఇది దేవాలయం యొక్క బాగోగులు చూడడమే కాకుండా వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంబందమైన కార్యక్రమాలను భారతదేశం అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించింది.

అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ నెలకొన్న వివాదాల కారణంగా ఆ ప్రతిష్ట కాస్త మసకబారుతూ వస్తోంది.ముఖ్యంగా ఇక్కడ రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరి ఆధ్యాత్మిక కేంద్రం కాస్తా వివాదాల కేంద్రంగా మారింది.

Telugu Tdp Chandrababu, Ttdtirupathi, Ycpttd-Telugu Political News

గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ వివాదాలకు ఆజ్యం పడింది.దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు మీడియా ను పిలిచి మరి అనేక ఆరోపణలు చేయడంతో వివాదానికి ఆజ్యం పడింది.ముఖ్యంగా పింక్ డైమాండ్ దేశం దాటిపోయిందని, శ్రీవారి పోటులో తవ్వకాలు జరిగాయని, శ్రీవారి పూజా కైంకర్యాలు సరిగ్గా నిర్వహించడంలేదని ఆయన సంచంలన విషయాలు బయటపెట్టాడు.దీంతో ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది.

దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకుని వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడింది.చంద్రబాబు ఇంట్లో తవ్వితే శ్రీవారి నగలన్నీ బయట పడతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కారణంగా టీటీడీ పరువు కాస్త బజారున పడింది అంటూ టీటీడీ వైసీపీ నాయకుల మీద పరువు నష్టం దావా వేసింది.

Telugu Tdp Chandrababu, Ttdtirupathi, Ycpttd-Telugu Political News

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అప్పట్లో చేసిన ఆరోపణలపై ఇప్పుడు వైసీపీ మౌనం వహిస్తోంది.అసలు ఆ ఆరోపణలకు తగిన సాక్షాలు కూడా వైసీపీ సంపాదించలేక సైలెంట్ అయిపొయింది.

అయితే గతంలో వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలపై కోర్టుకు ఎక్కినా టీటీడీ ఇప్పుడు ఆ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని చూడడడం పై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.అయితే ఈ విషయంలో వైసీపీ నాయకులు కావాలనే రాజకీయం చేసి శ్రీవారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా వైసీపీ నాయకులు వ్యవహరించారని, ఇప్పుడు మాత్రం ఏమీ ఎరగనట్టు మౌనంగా ఉండిపోతున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తోంది.

అదీ కాకుండా ఇప్పుడు రమణ దీక్షితులు మళ్ళీ టీటీడీ లో అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తుండడం మరింత రాజకీయ కాక రేపుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube