శివసేనలో చీలిక, బీజేపీకి లైన్‌ క్లీయర్‌

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంకు అతి త్వరలోనే తెర పడుతుందని ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు భావిస్తున్నారు.బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా కూడా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు 40 సీట్ల దూరంలో ఉంది.

 Some Siva Sena Party Mlas Join In Bjp Party-TeluguStop.com

కనుక శివసేన పార్టీ ముఖ్యమంత్రి పీఠంను కోరుతుంది.కాని బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.

ఈ సమయంలో శివసేన వెనక్కు తగ్గి ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందించి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి కీలక పదవులు కోరితే బాగుంటుందని కొందరు శివసేన పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు శివసేన పార్టీ నాయకులు మాత్రం ఇప్పుడు తప్పితే మళ్లీ సీఎం పీఠంపై కూర్చునే అవకాశం వస్తుందో రాదో ఈ అవకాశంను వదులుకోవద్దంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలు రెండుగా విడిపోయినట్లుగా సమాచారం అందుతోంది.బీజేపీకి మద్దతు ఇవ్వాలని దాదాపుగా 25 మంది శివసేన ఎమ్మెల్యేలు అధినాయకత్వంతో చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

వారి మాట అధినాయకత్వం వినకుంటే బీజేపీలోకి వారు మొగ్గే అవకాశం ఎక్కువగా ఉందంటూ సమాచారం అందుతోంది.వారి రాకతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు మార్గం కాస్త సుగమం అవుతుంది.

మరి కొందరు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube