పదేళ్లు గడిచినా చెక్కుచెదరని బర్గర్ ను చూసేందుకు ఎగబడుతున్న సందర్శకులు

ఏవైనా వస్తువులను సేల్ చేసే విషయంలో ఎన్ని సంవత్సరాలు అయినా మా వస్తువులు పాడవవు వంటి గ్యారింటీ లు ఇస్తూ ఉంటారు.ఇలాంటి ప్రోడక్ట్స్ చాలానే చూశాం,విన్నాం కూడా.

 Iceland Livestreams 10 Years Old Mcdonalds Cheese Burger-TeluguStop.com

కానీ తినే ఆహారాల విషయంలో మాత్రం ఒక్కరోజు గడిస్తే చాలు తెల్లారేసరికి అవి పాడైపోతాయి.కానీ మెక్ డొనాల్డ్స్ సంస్థ మాత్రం వస్తువుల విషయంలో ఇచ్చే ఆఫర్ లాంటి ఆఫర్ ఇస్తుంది.

మా దగ్గర బర్గర్ గానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ గానీ చెక్కుచెదరవు అంటూ తెగ ప్రచారం చేస్తుంది.అసలు వివరాల్లోకి వెళితే….

ఐస్ ల్యాండ్ లోని మెక్ డొనాల్డ్స్ సంస్థ తమ రెస్టారెంట్ లన్నిటిని 2009 లో మూసేసింది.అయితే తమ వద్ద కొన్న బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ పాడవవు అంటూ ప్రచారమా చేయడం తో ఆ సంస్థ రెస్టారెంట్ ను మూసి వేసే సమయంలో ఆ రెస్టారెంట్‌కు వెళ్లి కంపెనీ అమ్మిన ఆఖరి బర్గర్‌ను, దానితో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్‌ను స్మార్ సన్ అనే వ్యక్తి కొన్నారు.

అయితే ఈ పదేళ్లలో ఈ బర్గర్ అనేక ప్లేసులు మారుతూ వచ్చినప్పటికీ ఏమాత్రం పాడవక పోవడం గమనార్హం.

Telugu French, Mcdonaldscheese, Nationalmussium, Plasticbag-

మొదట బర్గర్‌తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్‌ను స్మారసన్ చెక్ చేయాలి అన్న ఉద్దేశ్యం తో ఓ ప్లాస్టిక్ సంచిలో పెట్టి కొన్నాళ్లపాటు తన గ్యారేజ్‌లోనే పెట్టాడు.అయితే మూడేళ్లు అలానే వదిలేసినప్పటికీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకపోవడంతో దానిని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఐస్‌ల్యాండ్‌కు అప్పగించాడు.ఆ తరువాత వివిధ కారణాల వల్ల అది వివిధ చోట్లకు ప్రయాణించి చివరకు స్నోట్రా హౌజ్‌కు చేరింది.

అయితే ఇటీవలే ఆ బర్గర్‌కు పదేళ్లు నిండాయి.వారు చెప్పినట్టే అది మన్నికగానే ఉంది.

దీంతో దక్షిణ ఐస్‌ల్యాండ్‌లోని స్నోట్రా హౌస్‌ అనే హోటల్‌లో దీన్ని ప్రదర్శనకు పెట్టారు.దీంతో ఆ బర్గర్‌ను చూసేందుకు సందర్శకులు తెగ ఎగబడుతున్నారు.

అంతేకాదు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్‌‌కి కూడా విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి.నిజంగా బర్గర్ కు పదేళ్లు నిండాయి అంటే కొంచం నమ్మశక్యం కాకపోయినా నిజంగా ఎంతటి క్వాలిటీ ఆ సంస్థ ఫాలో అవుతుంది అన్న విషయం మాత్రం అర్ధం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube