ఎల్వీకి ఆర్ఎస్ఎస్ తో లింక్ ఉందా ? జగన్ ఆగ్రహాం అందుకేనా ?  

L.v Subramanyam Transfer From Ap Governament-janasena Chief Pawan Kalyan,l.v Subramanyam

ఏపీలో రేగిన రాజకీయ ఇసుక తుపాను వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రగా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రధానంగా దీనిపైనే ద్రుష్టి పెట్టడంతో ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటోంది.

L.V Subramanyam Transfer From Ap Governament-Janasena Chief Pawan Kalyan L.v

దీనిపై ప్రభుత్వం తమ వాదన ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా ఇసుక కొరత కారణంగా ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.దీంతో వైసీపీ వాదన ఎక్కడా నెగ్గడంలేదు.తాజాగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కు టీడీపీ జనసేనతో కలవడం వైసీపీని ఇబ్బంది పెట్టడం జరిగిపోయాయి.ఈ గొడవ ఇలా జరుగుతుండగానే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

దీనిపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.అయితే సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలో జగన్‌ వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.సీఎస్‌ బదిలీతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాల్లో వేడి రాజుకుంది.

ఉన్నట్టుండి సీఎస్‌ను జగన్‌ ఎందుకు బదిలీ చేశారు? అందుకు దారితీసిన కారణాలేంటి? అని ఏపీవ్యాప్తంగానే కాకుండా.రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడిచింది.కానీ సీఎస్‌ బదిలీ వెనుక జగన్‌ రాజకీయం వేరే ఉన్నట్టు ఆ పార్టీ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నారు.ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాస్త ముందుగానే ఏపీ సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను బీజేపీ ప్రభుత్వం నియమించింది.

దీనిపై అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా కేంద్రం పట్టించుకోలేదు.

ఇదంతా జగన్ మేలు కోసమే అన్నట్టుగా టీడీపీ దీనిపై భారీగా విమర్శలు చేసింది.ఇక ఎన్నికల్లో అంతా అనుకున్నట్టుగానే వైసీపీ విజయకేతనం ఎగుర వేయడంతో పాటు జగన్‌ సీఎం అవ్వడంతో సీఎస్‌ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంనే కొనసాగించారు.

అయితే ఇప్పుడు ఐదు నెలల తరువాత ఎల్వీని సీఎస్‌ గా జగన్ తప్పించారు.అయితే దీనివెనుక జగన్‌కు బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

అది సుబ్రహ్మణ్యం కు ఆరెస్సెస్‌ తో లింక్ లు ఉండడమే కారణంగా తెలుస్తోంది.ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా ఎల్వీ ఆరెస్సెస్‌ కు చెబుతున్నారని జగన్ అనుమానిస్తున్నారట.

దీంతో వైసీపీ వ్యూహాలన్నీ బీజేపీకి ముందుగానే లీక్ అవుతున్నట్టు జగన్ భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎల్వీని తప్పుంచేందుకు జగన్ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.

ఇదే సమయంలో ఇసుక వివాదం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో విపక్షాల ను దాని నుంచి డైవర్ట్ చేయడానికి జగన్ ఇలా చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

.

తాజా వార్తలు