ఇంకెంత మంది చనిపోవాలి?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరం అయ్యింది.దాదాపు నెల రోజులు కావస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు మరింతగా ఈ సమ్మెను తీవ్రతరం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

 Telangana Rtc Strike In Saroornagar-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్యమాన్ని తీవ్ర రూపానికి తీసుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు.నేడు సకల జనుల భేరి సభను సరూర్‌ నగర్‌లో నిర్వహించారు.

ఈ సందర్బంగా పలు పార్టీల నాయకులు మరియు ప్రజా సంఘాలు హాజరు అయ్యారు.

ఈ మీటింగ్‌కు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం హాజరు అయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు 15 మంది వరకు చనిపోయారు.ఇంకా ఎంత మంది చనిపోవాలంటూ ప్రశ్నించాడు.

ఎప్పుడెప్పుడు ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయాలా అంటూ ఎదురు చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై తీవ్ర అసహనం ఆయన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌ తీరు పట్ల కోదండరాం తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆర్టీసీని నాశనం చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నట్లుగా ఆరోపించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube