కాలిఫోర్నియా జనానికి కరెంట్ కష్టాలు: మంటల ధాటికి పరిగెత్తిన హాలీవుడ్ స్టార్లు

కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా ఎన్నడూ లేని రీతిలో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు.పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఇప్పటికే 9,70,000 నివాస గృహాలు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరాను కట్ చేయడంతో ఎలక్ట్రిక్ నియంత్రణా సంస్థల నుంచి దర్యాప్తును ఎదుర్కోవాల్సి వచ్చింది.

 California Wildfirepeople Faces Huge Power Cuts Hollywood Starsfleefromfire-TeluguStop.com

అదే సమయంలో మరో 6,50,000 ఇళ్లకు ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు సంస్థ ప్రకటించింది.బలమైన గాలుల కారణంగా రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి.

లాస్ ఏంజిల్స్‌లోని సంపన్న ప్రాంతమైన బ్రెంట్‌వుడ్ పరిసరాల్లో కార్చిచ్చు కారణంగా సోమవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు.ఇందులో హాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం వున్నారు.

మంటలు చుట్టుముట్టడంతో హాలీవుడ్ స్టార్లు ప్రాణభయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.ప్రఖ్యాత నటుడు, రాజీకయ వేత్త ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్ ఇంటికి మంటలు అంటుకోవడంతో ఆయన బయటకి పరిగెత్తారు.

పరిస్ధితి తీవ్రం కావడంతో కాలిఫోర్నియా గవర్నర్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Telugu Hollywoodstars, Ups, Telugu Nri, Telugu Ups-

  కాగా కార్చిచ్చు కారణంగా విద్యుత్ సంస్థలు సరఫరాను తగ్గించడం ద్వారా నియమాలను ఉల్లంఘించాయా అనే దానిపై రెగ్యులేటింగ్ అధారిటీలు విచారణను ప్రారంభించాయి.అయితే ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం తాజా కరెంట్ కోతలకు పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సంస్థే కారణమని చెప్పినట్లుగా సమాచారం.2017, 2018 సంవత్సరాల్లో కార్చిచ్చు బాధితుల నుంచి వందలాది వ్యాజ్యాలను ఈ సంస్థ ఎదుర్కోవడంతో ఆ ఏడాది జనవరిలో కంపెనీ దివాలా కోసం దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube