ఐసీసీ చీఫ్ గా ఒకప్పటి సద్దాం హుస్సేన్ మిలిటరీ అధికారి

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్ చీఫ్ అబూబాకర్ బాగ్దాదీ ఆపరేషన్ కైలా ముల్లర్ లో భాగంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఐసిస్ కు కొత్త చీఫ్ ఎవరు అన్న దానిపై ఒక వార్త హల్ చల్ చేస్తుంది.

 Isis New Chief Abdullah Qardash-TeluguStop.com

అదే ఐసిస్ కొత్త చీఫ్ గా ఒకప్పుడు సద్దాం హుస్సేన్ వద్ద మిలిటరీ అధికారిగా విధులు నిర్వర్తించిన అబ్దులా ఖర్దాష్ భాద్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తుంది.

Telugu Delta Force, Isisabdullah, Kaila Mullar, Telugu General, Telugu-

  ఈ ఏడాది ఆగస్టు లో జరిగిన ఆపరేషన్ కైలా ముల్లర్ లో భాగంగా బాగ్దాదీ హతమైన విషయం విదితమే.ఈ ఏడాది ఆగస్టు లో డెల్టాఫోర్స్‌ కమెండోల హెలికాప్టర్లు సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతానికి చేరుకోగా బగ్దాదీ బస చేసిన భారీ భవంతి సమీపానికి రాగానే హెలికాప్టర్ల పైకి కింది నుంచి తుపాకీ గుళ్ల వర్షం కురిసింది.దీనితో అప్రమత్తమైన కమెండోలు తమ తుపాకులకు పనిచెప్పి నిమిషాల్లోనే గ్రౌండ్‌ ‘క్లియర్‌’ చేసేశారు.

అనంతరం గోడను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టారు.అయితే వారిలో కొందరు లొంగిపోగా,కొందరు కమెండో ల కాల్పుల్లో మృతి చెందారు.

అయితే అప్పటికే పరిస్థితి ని గమనించిన బాగ్దాదీ ఇక చేయి దాటి పోయింది అన్న సమయంలో తన ముగ్గురు పిల్లలను తీసుకొని ఒక సొరంగం లోకి పరుగులు తీశాడు.అయితే దానిని గమనించిన కమాండో లు జాగిలాల ను వదలడం తో ఓ వైపు యమదూతల్లా వెంటాడుతున్న జాగిలాలు! చెవుల్లో మార్మోగుతున్న వాటి అరుపులు! సొరంగంలో మరింత ముందుకెళ్తే మార్గం లేదు.

Telugu Delta Force, Isisabdullah, Kaila Mullar, Telugu General, Telugu-

  దీంతో.భయంతో అరుస్తూ, కేకలు వేస్తూ.చివరకు తన నడుముకు కట్టుకున్న బాంబుల బెల్టు మీట బాగ్దాదీ నొక్కడం.భారీ పేలుడుతో బగ్దాదీ దేహం ముక్కలు ముక్కలుగా పడిపోవడం జరిగిపోయింది.అయితే బాగ్దాదీ తో పాటు అతడి ముగ్గురు పిల్లలు కూడా మృతి చెందినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube