బైకు నడిపిన కుక్క.. ఔరా అంటోన్న జనం

కుక్క బైకు నడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

 Dog Rides Bike Video Goesviral-TeluguStop.com

ఎలాంటి భయం లేకుండా ఓ కుక్క ఇద్దరు వ్యక్తులను వెనకాల ఎక్కించుకుని మరీ బైకును తోలిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆ దారిగుండా కారులో వెళ్తున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయ్యింది.

కుక్క బైకు నడపడంతో ఆ కుక్కను పొగడ్తలతో ముంచెత్తారు నెటిజన్లు.అయితే కొందరు కుక్కను పొగిడేస్తుంటే, మరికొంతమంది ఆ వెనకాల కూర్చున్న వ్యక్తులపై సెటైర్ వేస్తున్నారు.

కుక్క బండినడపడం సరే, తేడా వస్తే మీపని అంతే అంటూ కామెంట్లు విసురుతున్నారు.

నిజానికి కుక్క బైకు తోలలేదని, అది తోలినట్లు కూర్చుందని, దాని వెనకాల కూర్చున్న వ్యక్తుల్లో ముందున్నవ్యక్తి బైకు నడిపి సాఫీగా వెళ్తున్న సమయంలో హ్యాండిల్ వదిలేశాడంటూ మరికొంతమంది అంటోన్నారు.

ఏదేమైనా కుక్క బైకు తోలినట్లు కనపించే ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube