కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటా: పాక్ నయా కెప్టెన్

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాబర్ ఆజం‌ను పాక్ క్రికెట్ బోర్డు ఎన్నుకున్న విషయం తెలిసిందే.కాగా తాను భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియమ్‌సన్‌లను ఆదర్శంగా తీసుకుంటానని ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.

 Indiancaptainkohli And Williamson Inspires Mesayspak Newcaptain Babar-TeluguStop.com

ప్రస్తుతం కోహ్లీ మరియు విలియమ్‌సన్ తమ జట్లను లీడ్ చేస్తున్న విధానం, బ్యాట్ చేస్తూ జట్టును విజయపథంలో తీసుకెళ్తున్న విధానం చాలా బాగుందని బాబర్ అన్నాడు.

సొంతగడ్డపై ఇటీవల జరిగిన టీ20 సీరీస్‌లో శ్రీలంక జట్టు చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

అయితే దీనిపై బాబర స్పందించాడు.శ్రీలంక సెకండ్ క్లాస్ ప్లేయర్లతో తాము ఆడలేదని.

కేవలం యువ ఆటగాళ్లతో మాత్రమే ఆడిన అనుభవం ఉందని అతడు తెలిపాడు.కేవలం మూడు మ్యాచుల్లో ఓడినంత మాత్రాన తమ ఆటతీరును ఎలా అంచనా వేస్తారని అతడు తెలిపాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాక్ జట్టుకు బలం తమ పేస్ బౌలింగ్ అని, ఆస్ట్రేలియా పిచ్‌లపై ఎక్స్‌ట్రా బౌన్స్ లభిస్తుందని బాబర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లుగా ఫకర్ జమాన్‌తో కలిసి తాను దిగుతానని.

ఇమామ్ ఉల్ హక్ బ్యాకప్ ఓపెనర్‌గా దిగుతాడని తెలిపాడు.ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుండగా నవంబర్ 3న సిడ్నీ వేదికగా తొలి టీ20 జరగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube