భారతీగా లేడీ అమితాబ్.. సలాం కొడుతున్న ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రంతో లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి అందికీ తెలిసిందే.ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్ర చేస్తోందా అనే ఆసక్తి సర్వత్రా ఏర్పడింది.

 Vijayashanthi First Look Released From Sarileru Neekevvaru-TeluguStop.com

కాగా ఈ సినిమాలో ఆమె లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయకుండా పెట్టి దీపావళి కానుకగా కొన్ని నిమిషాల ముందు రిలీజ్ చేశారు.

భారతీ అనే పాత్రలో విజయశాంతి నటిస్తోన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ పోస్టర్‌లో విజయశాంతిని ఆమె లాస్ట్ మూవీలో ఎలాగైతే చూశామో అలాగే ఉంది.ఏమాత్రం అందం తగ్గని లేడీ అమితాబ్‌ను చూసి ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చాలా గర్వంగా చూస్తున్నట్లు ఆమె పోజు ఈ సినిమాపై మరింత అంచనాలను క్రియేట్ చేస్తుంది.భారతీ అనే పాత్ర సినిమాలో మహేష్ బాబుకు ఏవిధంగా ముడిపడి ఉంటుందా అని అభిమానులు చూస్తున్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తు్న్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.మహేష్ బాబు సరసన ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన నటిస్తోండగా ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి మహేష్ బాబు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube