రెండు ప్రాణాలను కాపాడిన యాక్సిడెంట్

సాధారణంగా ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగిందంటేనే భయపడుతుంటాం మనం.యాక్సిడెంట్‌లో ఎవరికైనా ఏదైనా జరిగిందంటూ ఉక్కిరిబిక్కిరవుతాం.

 Accident Saved Couple Lives In Phoenix America-TeluguStop.com

ఇక కళ్ల ముందు జరిగే యాక్సిడెంట్లను చూసే ధైర్యం కూడా చాలా మందికి ఉండదు.కానీ ఓ యాక్సిడెంట్‌లో చావు అంచు నుండి తృటిలో తప్పించుకుంది ఓ జంట.

అమెరికాలోని ఫీనిక్స్‌లో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ జంట ప్రాణాలతో బయటపడింది.రోడ్డు దాటుతున్న ఓ జంటను ఓ కారు అతివేగంగా వచ్చి దాదాపు ఢీకొట్టబోయింది.

అయితే అదే సమయంలో మరోవైపు నుండి వస్తున్న కారు ఆ కారును ఢీకొట్టడంతో ఆ రెండూ రోడ్డు పక్కకు వెళ్లాయి.దీంతో ఆ జంట మరోపక్కకు పరుగులు తీసింది.

ఇందులో మరో విశేషం ఏమిటంటే.రెండు కార్లు నడుపుతన్న వ్యక్తులకు కూడా పెద్దగా గాయాలేమీ కాలేదు.

దీంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోను ఫీనిక్స్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube