కొరటాల సోషల్ మెసేజ్.. రీల్ కాదు రియల్!

టాలీవుడ్‌లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన రైటర్ కొరటాల శివ.ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చాడు.

 Koratalasivaa Social Post Onsavewater-TeluguStop.com

కొరటాల ప్రత్యేకత ఏమిటంటే.దర్శకుడిగా ఆయన తీసిన నాలుగు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా ఫెయిల్యూ్ర్‌గా మిగల్లేదు.

అంతేకాదండోయ్.ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ కూడా ఉంది.

మిర్చి సినిమాలో ప్రేమ.శ్రీమంతుడు సినిమాలో గ్రామాల దత్తత, జనతా గ్యారేజ్‌లో కాలుష్యం.

భరత్ అనే నేనులో రైతు సమస్యలపై కొరటాల తనదైన రీతిలో మెసేజ్ ఇస్తూ సినిమా కథలు రాసుకుని వాటిని బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా మలిచాడు.అయితే ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నిజంగానే మెసేజ్ ఇస్తోంది.

కొరటాల శివ ఆఫీసులో వర్షపు నీటిని వృథా చేయకుండా వాటిని ఇంకుడు గుంతలోకి మళ్లించిన తీరును ఓ వీడియో తీసి పోస్ట్ చేశాడు.

Telugu Koratala Siva, Save, Message, Telugu-

‘సేవ్ వాటర్’ అంటూ ఆయన ఇస్తోన్న సోషల్ మెసేజ్ కేవలం రీల్ వరకు కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఉందంటూ నెటిజన్లు కొరటాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఏదేమైనా కొరటాల సినిమాలతోనే కాకుండా నిజజీవితంలోనూ సోషల్ మెసేజ్‌లు ఇవ్వడమే కాకుండా వాటిని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని.ఇతర తెలుగు దర్శకులు కూడా దీనిని పాటించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube