మేము రెడీ మీరు రెడీ నా ? మున్సి'పోల్స్' కు సిద్దమైన ప్రభుత్వం

ఒకపక్క తెలంగాణలోని హుజూర్ నగర్ ఎన్నికల హడావుడి తంతు ముగిసిందో లేదో అప్పుడే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది.ఇటీవల ఈ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది.

 Trs Give The Challenges To Other Parties In Muncipal Elections-TeluguStop.com

ఈ మేరకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇదే అంశాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేశారు.మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని, ప్రభుత్వం దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.

Telugu Congressbelive, Congress Bjp, Huzurnagar, Trsgive-Telugu Political News

  స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ తన సత్తా ఇప్పటికే నిరూపించుకుంది.అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని అధికార టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.ప్రస్తుతం హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీలో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.ఇక ఇదే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ బిజెపి పార్టీలు కూడా ఆరాట పడుతున్నాయి.

గ్రామాల్లో బిజెపి కి ఆదరణ తక్కువగా ఉన్నా పట్టణ ప్రాంతాల్లో యువత, విద్య, ఉద్యోగార్థులు తమ వైపు ఉంటారని బిజెపి ఆశలు పెట్టుకుంది.

Telugu Congressbelive, Congress Bjp, Huzurnagar, Trsgive-Telugu Political News

 

వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బిజెపి ఉంటుందని, ఇప్పటికే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున పార్టీలోకి వలసల రావడం దీనికి సంకేతం అని బిజెపి బలంగా నమ్ముతోంది.ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటలేకపోయినా ఆ తర్వాత తర్వాత పార్టీలోని లోపాలను, గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి తామంతా ఐక్యతతో ఉన్నామని ఆ పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు.

Telugu Congressbelive, Congress Bjp, Huzurnagar, Trsgive-Telugu Political News

  ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమయ్యామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.టీఆర్ఎస్ పై వ్యతిరేకత పట్టణ ప్రజల్లో బాగా ఉందనీ, అది తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నాయకులు ముందు నుంచీ చెబుతున్నారు.దీనికి తోడు పట్టణ ప్రాంత యువత తమ వైపు మొగ్గు చూపుతారనే ఆశతో ఉంది.

నంబర్ టు స్థానంలో తాము ఉన్నామని నిరూపించుకుంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ ఉంటుందని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు.ఇలా ఎవరికి వారు మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube