బీటెక్ విద్యార్ధినికి 42 లక్షల జీతం.. ఎక్కడో కాదు హైదరాబాద్‌లోనే!

బీటెక్ చదువుకునే విద్యార్ధులు తమ కలలను నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడి చదువుతుంటారు.అతి కష్టం మీద చదవడమే కాకుండా క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయ్యేందుకు రాత్రింబవళ్లు చదువుతుంటారు.

 Btech Student Offered With 42 Lakhs Package For First Job-TeluguStop.com

కానీ కొందరికి అదృష్టం మామూలుగా ఉండదని తెలుపుతోంది ఓ తాజా ఘటన.బీటెక్ చదువుతున్న ఓ విద్యార్దినికి జాక్‌పాట్ లాంటి ఉద్యోగావకాశం రావడంతో ఆమె ఉబ్బితబ్బిబవుతోంది.

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తాన్యా అరోరా అనే యువతి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఈ విద్యార్దిని క్యాంపస్ సెలక్షన్స్‌లో అదిరిపోయే ఉద్యోగం సాధించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తాన్యాకు ఏడాదికి రూ.42 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం లభించింది.ఒక బీటెక్ విద్యార్ధికి ఇంత మొత్తంలో భారీ జీతం రావడం ఇదే ప్రథమం.

అయితే ఇదంతా ఎక్కడో విదేశాల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.ఎందుకంటే తాన్యా అరోరాకు హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది.దీంతో తాన్యా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube