ఆ 22 రాష్ట్రాలకు ప్రయాణం నిషేధించిన శాన్‌ఫ్రాన్సిస్కో: ఎందుకంటే..?

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఉద్యోగులు గర్భస్రావాలను నిషేధించిన 22 రాష్ట్రాలలో వృత్తిరీత్యా ప్రయాణించడం కానీ.ఆయా రాష్ట్రాలతో వ్యాపారం చేయడాన్ని నగర మేయర్ నిషేధించారు.

 Travelbansan Franciscoblacklists22 States Forrestrictiveabortion-TeluguStop.com

ఈ దేశంలో మహిళల పునరుత్పాదక హక్కులు ప్రతిరోజు ప్రమాదంలో పడుతున్నాయని.వాటి కోసం తాము పోరాడుతున్నామని శాన్‌ఫ్రాన్సిస్కో మేయర్ లండన్ బ్రీడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్‌జీబీటీక్యూ వ్యక్తల పట్ల వివక్ష చూపే చట్టాలను కలిగి ఉన్న రాష్ట్రాలతో సంబంధాన్ని తాము గతంలో నిషేధించామన్నారు.అలాగే మహిళల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే, వారి పునరుత్పత్తి స్వేచ్ఛను పరిమితం చేయడానికి చురుకుగా పనిచేస్తున్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా తాము పోరాడతామని బ్రీడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఏ రాష్ట్రాలైతే గర్భస్రావ హక్కును విస్మరించాయో ఆయా రాష్ట్రాలకు ప్రయాణాన్ని పరిమితం చేయడంతో పాటు వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిషేధించిన సమాచారాన్ని తాము సదరు రాష్ట్రాలకు తెలియజేశామని ఆమె వెల్లడించారు.

శాన్‌ఫ్రాన్సిస్కో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన రాష్ట్రాలు: అలబామా, అర్కాన్సాస్, ఫ్లోరిడా, జార్జియా, ఇండియానా, అయోవా, కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మసాచుసెట్స్, మిస్సిస్సిప్పి, నెబ్రాస్కా, నెవాడా, నార్త్ డకోటా, ఒహియో, ఓక్లహోమా, పెన్సిల్వేనియా, సౌత్ కరోలినా, సౌత్ డకోటా, టెక్సాస్, వెస్ట్ వర్జీనియా మరియు విస్కాన్సిన్

Telugu Lgbwtq, San Francisco, Telugu Nri Ups, Travel Ban-

  అలాగే ఎల్జీబీటీక్యూల పట్ల వివక్ష చూపుతున్న రాష్ట్రాలైన అలబామా, అయోవా, కాన్సాస్, కెంటుకీ, మిసిసిపీ, ఓక్లహోమా, సౌత్ కరోలినా, సౌత్ డకోటా మరియు టెక్సాస్‌లను ఇప్పటికే శాన్‌ఫ్రాన్సిస్కో బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.ఈ నిషేధం జనవరి 1, 2020 నుండి అమల్లోకి వస్తుందని మేయర్ వెల్లడించారు.

ఈ చర్య ఆయా రాష్ట్రాల్లో గర్భస్రావ నిరోధక చర్యలను పునరాలోచించేలా చేస్తుందని తాము భావించడం లేదని నగర అధికారులు తెలిపారు.

అయితే బ్రీడ్ కార్యాలయం మాత్రం తమ చర్య మిగిలిన నగరాలకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని భావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube