డల్లాస్‌లో టోర్నడో విధ్వంసం: అర్థరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం

టోర్నడో ధాటికి ఆదివారం అర్ధరాత్రి డల్లాస్ చివురుటాకులా వణికిపోయింది.దీని కారణంగా ఇళ్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

 Thetornadohits Dallas Leavingatrail Of Heavy Damageacross-TeluguStop.com

సుమారు 17 మైళ్ల పాటు కొనసాగిన టోర్నడో ధాటికి.నగరంలో సుమారు 95,000 మంది రాత్రంతా అంధకారంలోనే గడిపినట్లుగా సమాచారం.

ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణనష్టాలకు సంబంధించిన వివరాలు తెలియరానప్పటికీ.కొందరు స్థానికులు తమ సన్నిహితులు, బంధువుల క్షేమ సమాచారాన్ని ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా డల్లాస్ మార్నింగ్ న్యూస్ ఒక కథనంలో తెలిపింది.

ఈ ప్రాంతంలో భారీ గాలులు, వడగాలులు వీస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.టోర్నడో విరుచుకుపడిన సమయంలో కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో ఆప్‌లోడ్ చేశారు.

సదరు దృశ్యాలను బట్టి టోర్నడో తీవ్రత, ఆస్తినష్టం గురించి అధికారులు ఓ అంచనాకు వచ్చి సహాయక చర్యలు అందించేందుకు రంగంలోకి దిగారు.

Telugu Heavy Damage, Telugu Nri Ups, Tornado, Tornadohits-

  వాయువ్య డల్లాస్ నుంచి సాయం కోసం ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా డల్లాస్ ఫైర్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ తెలిపింది.టోర్నడో ధాటికి ఇంటి అద్దాలు పగిలి పలువురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ నివాసం సైతం టోర్నడోలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.

టోర్నడో విధ్వంసంపై డల్లాస్‌లోని ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.సోమవారం ఉదయం వరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.

అయితే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ లైన్లు లీకవుతున్నట్లుగా ఫిర్యాదులు అందాయని తెలిపింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube