అమెరికాలో అంతే: అర్థరాత్రి చాటుగా చొరబడి.. 22,000 యాపిల్స్ దోచుకెళ్లారు

ఎవరైనా బంగారం లేదా డబ్బు దొంగతనం చేస్తారు.ఇంకా కిలాడీలైతే పెద్దపెద్ద బ్యాంకులకు కన్నాలు వేసి దొరికినంతా దోచేస్తారు.

 Thieves Steal More Than 22000 Apples From Spicer Orchard In Michigan-TeluguStop.com

అయితే అమెరికాలో కొందరు దొంగలు మాత్రం యాపిల్ పండ్లు దొంగతనం చేశారు.మిచిగన్‌లోని ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన యాపిల్ తోట నుంచి సుమారు 22,000 యాపిల్స్‌ను దొంగతనం చేశారని.

వీటి విలువ సుమారు 14,400 డాలర్లు ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చెట్ల నుంచి 7,000 పౌండ్ల యాపిల్స్‌ను సేకరించి వచ్చే వారం కోసం గోడౌన్‌లో నిల్వ చేశామని.

వీటిలో కొత్త రకం యాపిల్స్ కూడా ఉన్నాయని స్పైసర్ ఆర్చర్డ్ హార్వెస్ట్ మేనేజర్, మాథ్యూ స్పైసర్ తెలిపారు.స్పైసర్ ఫార్మ్స్‌కు చెందిన పండ్ల తోటలు హార్ట్‌ల్యాండ్ క్లైడ్ రోడ్‌లోని యూఎస్ 23లో ఉన్నాయి.

సాధారణంగా యాపిల్ తోటల యజమానులు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి తమ పంట ఎదుగుదల, తెగుళ్లు, చీడ పీడలను పరిశీలిస్తారు.ఈ క్రమంలో అక్టోబర్ 9న స్పైసర్ ఫార్మ్స్ యాజమాన్యం తమ పండ్ల తోటల్లో తనిఖీలు చేస్తోంది.

అయితే 5 ఎకరాల్లో విస్తరించివున్న యాపిల్ తోటల్లో ఎలాంటి పండ్ల కనిపించకపోవడంతో రేయాన్ స్పైసర్‌‌కు దొంగతనం జరిగినట్లుగా కనిపించింది.వెంటనే జెనెసీ కౌంటీ షెరీఫ్‌కు ఫిర్యాదు చేశాడు.

అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగి వుండవచ్చని మాథ్యూస్ భావిస్తున్నాడు.తోటలో సీసీ కెమెరాలు ఉన్నట్లు గమనించిన దొంగలు వాటికి చిక్కకుండా పని ముగించినట్లుగా తెలుస్తోంది.

పండిన యాపిల్స్‌కు, పండని యాపిల్స్‌కు మధ్య తేడా దుండగులకు తెలిసి ఉండకపోవచ్చునని మాథ్యూస్ తెలిపాడు.

Telugu Apples Steal, Acre, Spicer Orchards-Telugu NRI

 

పోలంలో ఉన్న టైరు గుర్తులను బట్టి మొత్తం మూడు లేదా నాలుగు ట్రక్కుల్లో యాపిల్స్‌ను తరలించారని భావిస్తున్నారు.తమ కుటుంబం 50 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నామని కానీ ఇంతవరకు దొంగతనం జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.అయితే సెయింట్ క్లెయిర్ కౌంటీలోని గ్రాంట్ టౌన్‌షిప్‌లోని పండ్ల తోటల నుంచి 400 గుమ్మడికాయల దొంగతనం అలాగే గత నెలలో ఇండియానా ఆర్చర్డ్ నుంచి 50,000 ఆపిల్స్ దొంగిలించుకుపోయిన ముఠాకు తాజా దొంగతనంతో సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube