పాము పేరు వినగానే ఎవరికీ వారు అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు.ఆ మధ్య కర్ణాటక లో ఒక బాత్ రూమ్ టాయిలెట్ లో పాము వచ్చిన ఘటన గుర్తు ఉండే ఉంటుంది.
అయితే ఇప్పుడు తమిళనాడు లో ఏకంగా ఇంటిలోని వంటగదిలోని మిక్సీ జార్ లో పాము పిల్ల కనిపించింది.వివరాల్లోకి వెళితే… తమిళనాడు లోని అన్నా నగర్ తునికి చెందిన మురుగన్ అనే పూల వ్యాపారి ఇంట్లో వంట గదిలో ఎదో శబ్దం రావడం తో వెళ్లి చూశారు.
అయితే వంటగదిలో ఒక మూల నుంచి పాము శబ్దం వస్తున్నట్లు గమనించిన మురుగన్ వెంటనే పాములు పెట్టే కన్నన్ అనే వ్యక్తికి సమాచారం అందించి ఇంటికి పిలిపించాడు.ఇంటికి వచ్చిన కన్నన్ మురుగన్ వంటగదిలోని పాత్రలను చూడగా వారి మిక్సీ జార్ లో ఒక పాము పిల్ల ఉండడాన్ని గుర్తించి వెంటనే దానిని పట్టుకున్నాడు.
దీనితో ఆ పాము పిల్లను చూసిన ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి.
అయితే ఆ పాము ఎక్కడ నుంచి ఇంటిలోకి వచ్చిందో గానీ మొత్తానికి వారి మిక్సీ జార్ లో ప్రత్యక్ష మయ్యేటప్పటికీ వారంతా ఉలిక్కిపడ్డారు.మొత్తానికి పాములు పెట్టే కన్నన్ ఆ పాము పిల్లను పట్టుకొని దూరంగా తీసుకొని వెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
దీనితో మురుగన్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.