ఎట్టకేలకు రవిప్రకాష్‌కు బెయిల్‌

టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌పై ఆర్థిక నేరాల కేసు నమోదు అయిన విషయం తెల్సిందే.టీవీ9 సంస్థకు చెందిన డబ్బును అక్రమంగా ఆయన తరలించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.కొత్త యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.పోలీసుల కస్టడీలో ఉన్న రవి ప్రకాష్‌ బెయిల్‌ కోసం పిటీషన్‌ దాఖలు చేశాడు.

 Ravi Prakash Got The Bail-TeluguStop.com

ఎట్టకేలకు ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడం జరిగింది.

లక్షరూపాయల పూచికత్తు మరియు హైదరాబాద్‌ వదిలి వెళ్లి పోవద్దనే కండీషన్స్‌పై రవి ప్రకాష్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.

రవి ప్రకాష్‌ పోలీసుల విచారణలో సహకరించాలని, ఎప్పుడు అడిగితే అప్పుడు విచారణకు రావాలంటూ కూడా కోర్టు ఆదేశించింది.ఒక కేసులో రవి ప్రకాష్‌కు బెయిల్‌ వస్తే మరికొన్ని కేసులు ఆయనపై నమోదు అయ్యాయి.

రవి ప్రకాష్‌ ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేశాడని, ఆయనకు చెందిన ఒక ఆన్‌లైన్‌ ఛానెల్‌లో తప్పుడు కథనాలు తనపై ప్రసారం అయ్యాయంటూ ఒక వ్యక్తి కేసు పెట్టాడు.ఈ కేసుల్లో మళ్లీ రవి ప్రకాష్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube