ఏపీలో టీవీ5, ఏబీఎన్‌ బ్యాన్‌ విషయమై జగన్‌కు చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్‌లో టీవీ5 మరియు ఏబీఎన్‌ ఛానెల్స్‌ అనధికారికంగా బ్యాన్‌ అయిన విషయం తెల్సిందే.కేబుల్‌ ఆరపరేటర్లు ఆ రెండు చానెల్స్‌ను వినియోగదారులకు చూపించడం లేదు.

 Tv5 And Abn Re Start In Andhrapradesh-TeluguStop.com

దాంతో సదరు చానెల్స్‌ రెండు కూడా పలు చోట్ల ఫిర్యాదు చేశాయి.ఎట్టకేలకు ఆ రెండు ఛానెల్స్‌ బాధను టీడీశాట్‌ అర్ధం చేసుకుని విచారణకు ఆదేశించింది.

ఏపీలో నిజంగా ఆ రెండు ఛానెల్స్‌పై అనధికారిక బ్యాన్‌ నడుస్తుందని గ్రహించి వెంటనే రంగంలోకి దిగినట్లుగా సమాచారం అందుతోంది.

ఉద్దేశ్య పూర్వకంగా ఆ రెండు ఛానెల్స్‌ను బ్యాన్‌ చేసినందుకు గాను కేబుల్‌ ఆపరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే ఆ ఛానెల్స్‌ను పునరుద్దరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.ప్రసారాలు ప్రారంభించకుంటే ఆ రోజు నుండి రోజుకు రెండు లక్షల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్బంగా టీడీశాట్‌ ప్రకటించింది.

ఇప్పటి వరకు జరిగిన ఉల్లంఘనకు గాను 15 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube