ఆర్టీసీ కొలువులకు సిద్దం అవ్వండి అంటున్న ప్రభుత్వం

తెలంగాణ ఆర్టీసీ నుండి దాదాపుగా 48 వేల మంది ఉద్యోగులు స్వచ్చందంగా తప్పుకున్నట్లుగా ప్రకటించిన ప్రభుత్వం కొత్తవారిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాలనుకున్న వారికి విద్యార్హతను నిర్ణయించాల్సిందిగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది.

 Telangana Governament Ready To Announce The Rtc Jobs Notification-TeluguStop.com

ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది.ఆ నివేదిక ప్రకారం డ్రైవర్‌ పోస్ట్‌లకు 10వ తరగతి పాస్‌ అయ్యి ఉండటంతో పాటు హెవీ వెయికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ మరియు రెండేళ్ల అనుభవం ఉండాలని.

ఇక కండెక్టర్స్‌ పోస్ట్‌కు 10వ తరగతి పాస్‌ అయ్యి 35 ఏళ్లు దాటకుండా ఉండాలి.ఈ రెండు జాబులతో పాటు ఆపీస్‌ స్టాప్‌కు కూడా పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది.

ఆ ఉద్యోగాలకు డిగ్రీ మరియు ఇంటర్‌గా నిర్ణయించారు.ఒక వైపు ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే మరో వైపు ప్రభుత్వం మాత్రం వారు అసలు ఆర్టీసీ ఉద్యోగులు కారు, వారికి దర్నా చేసే అధికారంలో లేదు అంటూ డిపోల వద్దకు కూడా రానివ్వడం లేదు.

ఇదే సమయంలో కొత్త ఉద్యోగాల ప్రకటనకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube