ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ : జీవితాన్ని ప్రభావితం చేసే రంగులు ఏంటో తెలుసా?

మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే వాటిలో రంగులకు ప్రధాన స్థానం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.రంగులు అనేవి లేకుంటే జీవితం అంతా చీకటి మయం అయ్యేది.

 How Does Colors Affect And Helps Humans Everyday Life-TeluguStop.com

ఒకప్పుడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలకు ఇప్పుడు కలర్‌ సినిమాలకు ఏ స్థాయి తేడా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాంటి అద్బుతమైన మార్పును తీసుకు వచ్చిన రంగులు మనిషి జీవితంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయని స్వయంగా శాస్త్రవేత్తలు నిరూపించారు.

రంగులతో మానవ జీవితం ముడిపడి ఉంటుంది, రంగును బట్టి మనిషి మూడ్‌ ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు పరిశోదనల్లో వెళ్లడించారు.

Telugu Blue, Colors, Colorsaffect, Red, Silver, Yellow-

  మనిషికి ఆకలిని కలిగించే రంగులుగా ఎరుపు మరియు పసుపు రంగులకు పేరు ఉంది.ఆ రంగులను ఎక్కువగా చూసినట్లయితే త్వరగా ఆకలి వేస్తుంది.మనిషిలో ఆకలి అనే కోరిక కలగడానికి ఈ రెండు రంగులు ప్రధాన కారణాలుగా చెబుతారు.

అందుకే ఆహార సంబంధిత షాప్స్‌ మరియు ఇతర మాల్స్‌, రెస్టారెంట్స్‌కు ఎరుపు లేదా పసుపు రంగులతో బోర్డులను రాస్తారు.ఈ విషయం అమెరికన్‌ శాస్త్రవేత్తలు పలు ప్రయోగాల ద్వారా నిరూపించారు.

ఇక ఆకుపచ్చ రంగుతో కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.ఎక్కువ సమయం దీర్ఘంగా చూడటం వల్ల కంటిపై ఒత్తిడి పడుతుంది.

అలాంటి సమయంలో ఆకుపచ్చ రంగును కనీసం అయిదు నిమిషాలు చూడటం వల్ల కళ్లు చాలా రిలాక్స్‌ అవుతాయి.

Telugu Blue, Colors, Colorsaffect, Red, Silver, Yellow-

  తెలుపు రంగు మనశ్శాంతిని కలిగిస్తాయి.తెల్లరంగుతో బాధలు, దు:ఖంను పోగొట్టుకోవచ్చు.ముఖ్యంగా గర్బిణిలు తెల్లరంగును రెగ్యులర్‌గా చూస్తూ ఉండటం వల్ల వారి ఆరోగ్యం బాగుండటంతో పాటు, పుట్టబోయే బిడ్డ విషయంలో చాలా ఉపయోగదాయకంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

తెల్లరంగును పలు విధాలుగా కూడా జనాలు ఉపయోగిస్తారు.చిన్న పిల్లలకు కూడా తెల్లరంగు చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది.వారి కంటిపై ఒత్తిడి లేకుండా తెల్లరంగు చేస్తుంది.అందుకే ఇంటి లోపలి గోడలకు తెల్లరంగు వేసుకోవడం బెటర్‌.

Telugu Blue, Colors, Colorsaffect, Red, Silver, Yellow-

  ఎరుపు రంగు మనిషికి విప్లవ భావాలను కలిగిస్తుంది.రక్తం ఎర్రగా ఉంటుంది.అందుకే ఎరుపు అనగానే ఉద్యమం గుర్తుకు వస్తుంది.భయం, ఆందోళనతో ఎప్పుడు మగ్గుతూ ఉండే వ్యక్తి ఎరుపు రంగును ఎక్కువగా చూడటం వల్ల తనలోని భయంను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.

అందుకే మనిషి రెగ్యులర్‌గా ఎరుపు రంగును వాడుతూ ఉండాలి.అప్పుడే మనిషిలో పిరికితనం ఉండదు.మనుషులకు ఎరుపు విప్లవ సూచకం.కాని కోళ్లకు మాత్రం ఎరుపు రంగు శాంతి సూచకం అని, తమకు అక్కడ భద్రత ఉంటుందని భావిస్తాయట.

Telugu Blue, Colors, Colorsaffect, Red, Silver, Yellow-

  ఇక వాహనాలు సిల్వర్‌ కలర్‌లో ఉన్నవి తీసుకోవడం సుభ సూచకం అంటున్నారు.ఒక సర్వే ప్రకారం సిల్వర్‌ కలర్‌ కార్లు యాక్సిడెంట్స్‌కు చాలా తక్కువ అవుతాయట.బూడిద రంగు బద్దకానికి నిదర్శణం.అందుకే ఆ రంగుకు దూరంగా ఉండటం బెటర్‌.ఇలా జీవితంలో మనకు తెలియకుండానే మన జీవితాన్ని రంగులు నడుపుతున్నాయి.

Telugu Blue, Colors, Colorsaffect, Red, Silver, Yellow-

  మన జీవితం సక్రమంగా సాగకపోయినా, అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మొదటగా మీ జీవితంలో రంగులు నింపుకోండి, ఆ తర్వాత ఆనందం వచ్చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube