యూఎస్‌లో 'సైరా' నష్టం ఎంతో తెలుసా?

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిపై అంచనాలు భారీగా ఉన్న కారణంగా యూఎస్‌లో సినిమాను ఏకంగా 3.3 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయడం జరిగింది.సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా అక్కడ వసూళ్లు మాత్రం చాలా నీరసంగా ఉన్నాయి.మిలియన్‌ డాలర్లను చేరుకునేందుకు కష్టపడి ఏదోలా రెండు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసింది.

 In Usa Saira Narasimha Reddy Huge Loss-TeluguStop.com

ఇక లాంగ్‌ రన్‌లో ఇంకా మిలియన్‌ డాలర్లు వస్తాయనే నమ్మకం అయితే అస్సలు లేదు.

Telugu Dollars, Usasaira, Sairaasimha-

  సైరా సినిమా వల్ల యూఎస్‌ బయ్యర్లు దాదాపుగా 7 కోట్ల వరకు నష్టపోయి ఉంటారంటూ ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యూఎస్‌ రైట్స్‌ను కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పుడు నిర్మాత రామ్‌ చరణ్‌ను ఆదుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారట.5 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని చరణ్‌ను బయ్యర్లు ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Telugu Dollars, Usasaira, Sairaasimha-

  యూఎస్‌లో సైరా చిత్రం 5 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో 3.3 మిలియన్‌ డాలర్లను పెట్టి కొనుగోలు చేయడం జరిగింది.కాని లాభాల సంగతి పక్కన పెడితే కనీసం బ్రేక్‌ ఈవెన్‌ కూడా సాధ్యం అయ్యే పరిస్థితి లేదు.ఖైదీ నెం.150 చిత్రంతో మంచి లాభాలు దక్కించుకున్న బయ్యర్లు ఈసారి మాత్రం ఏకంగా 7 కోట్ల వరకు నష్టపోవడం కన్ఫర్మ్‌ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube