ఫుడ్ డెలివరీ కి వచ్చి ఇలాంటి చెత్త పని చేశాడు!

ఫుడ్ డెలివరీ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపొయింది.చేసుకొనే ఓపిక లేకపోయినా లేదంటే బయట ఫుడ్ అంటే ఇష్టపడేవారు ఎవరైనా ఇప్పుడు ఇంట్లో కూర్చొనే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.

 Zomato Delivery Man Kidnaps Pet Dog After Delivering Food-TeluguStop.com

దీనితో క్షణాల్లో ఫుడ్ ఇంటి ముందు వచ్చి వాలుతుంది.దీనికి సంబంధించి పలు యాప్ లు అందుబాటులోకి వచ్చేయడం తో జనాలకు ఎలాంటి ఇబ్బంది లేదు ఫుడ్ విషయం లో.అయితే ఇలాంటి ఈ ఫుడ్ డెలివరీ వల్ల కొన్ని ఆశ్చర్యపోయే ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి అని ఈ తాజాగా ఉదంతం గురించి వింటే మాత్రం అర్ధం అవుతుంది.ఇంతకీ ఏమి జరిగింది అని అనుకుంటున్నారా.

ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన బాయ్ ఐటమ్ తెచ్చి ఇచ్చి వారి పెంపుడు కుక్క ను ఎత్తుకుపోయారు.ఈ ఘటన మహారాష్ట్ర లోని పూణే లో చోటుచేసుకుంది.

వందనా షా అనే బాధితురాలు తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది.మధ్యాహ్నం వేళ ఫుడ్ కోసం ఆర్డర్ పెట్టగా, ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన ఆ యువకుడు ఆమె పెంపుడు కుక్క ను పట్టుకుపోయాడు.

అయితే సీసీ కెమెరా ఫుటేజ్ చూడగా,ఆ కుక్క ఇంటిలోపల ఆవరణలో ఆడుకుంటూ పక్కనే ఉన్న ఫ్యాక్టరీ ఆవరణ లోకి వెళ్లినట్లు తెలిసింది.అయితే ఆ తరువాత ఆ కుక్క కనిపించకుండా పోవడం తో ఏమైందో తెలియక ఆమె కంగారు పడింది.

దీనితో చుట్టుపక్కల వారిని విచారించగా వారందరూ కూడా తమకు తెలియదని చెప్పడం తో ఫుడ్ డెలివరీ బాయ్ ఎత్తుకు పోయి ఉంటాడు అని అనుమానము రావడం తో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.అయితే పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం తో వారికి ఏమి చేయాలో అర్ధం కాలేదు.

అయితే వారికి వీరికి చెబుతుండగా ఒక హోటల్ లో పనిచేసే కుర్రాడు తన స్నేహితుడి వద్ద ఒక కుక్క ను చూశానని సమాచారం ఇవ్వడం తో వారి అనుమానం నిజమైంది.దీనితో ఆ కోణంలో వారే విచారించగా మొత్తానికి కుక్క తో పాటు ఆ డెలివరీ బాయ్ తీసుకున్న ఫోటో కూడా సేకరించడం తో వారి అనుమానం బలపడినట్లు అయ్యింది.

అయితే మిగతా వివరాలు విచారించగా అతడు జొమాటో లో పనిచేసే డెలివరీ బాయ్ అని అతడి పేరు తుషార్ అని తెలుసుకున్నారు.దీనితో అతడి ఫోన్ నెంబర్ సేకరించి ఫోన్ చేయగా ఆ కుక్క వాళ్లదని తనకు తెలియదని,ముద్దుగా ఉంది కదా అని తనతో తీసుకెళ్లానని చెప్పాడు.

అయితే ఆ కుక్క తమదే అని తెలిపి కుక్కను తిరిగి ఇవ్వమంటే దానికి తుషార్ మాత్రం ఆ కుక్క ఇప్పుడు నాతొ లేదని, నా సొంతూరికి పంపించేశానని అన్నాడు.దాంతో వందనా షా దంపతులు కుక్క ను తిరిగి ఇచ్చేస్తే డబ్బులు కూడా ఇస్తామని చెప్పినప్పటికీ వారికి సరైన సమాధానం ఇవ్వలేదు సరికదా మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేశాడు.

దీనితో ఏమి చేయాలో అర్ధం కానీ ఆ జంట తమ గోడు ను జొమాటో కి వివరించారు.తమ బీగిల్ కుక్క వెనక్కి వచ్చేసేలా సాయం చెయ్యాలని జొమాటో ని ట్విట్టర్ ద్వారా కోరారు.

Telugu Kidnaps Pet Dog, Telugu Ups, Zomato Delivery, Zomatodelivery-

అయితే జొమాటో కూడా వెంటనే వారి అభ్యర్ధన పై స్పందించి ఇలాంటి చర్యల్ని క్షమించే ప్రసక్తి లేదని తెలిపింది.ఏ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారో ఆ వివరాల్ని పంపమని కోరింది.వెంటనే తమ సిబ్బందిని పంపి సమస్యను సాల్వ్ చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.మరి ఇంతగా శ్రమిస్తున్న వందనా షా ఫ్యామిలీ కి ఆ కుక్క దొరుకుతుందో లేదో మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube