ట్రంప్ సరికొత్త రికార్డ్...!!!

ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో పోటీ చేయాలంటే తప్పకుండా డబ్బు అవసరం తప్పనిసరి.అందుకే రాజకీయ పార్టీలకి వివిధ కంపెనీలు, ప్రజలు, స్వచ్చందంగా వితరణ ఇస్తూ ఉంటారు.

 Donald Trump Newtrack Record For Election Donations-TeluguStop.com

పార్టీ నేతలు కూడా నిధుల సేకరణ చేపడుతారు.అయితే అగ్ర రాజ్యం అమెరికాలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రిపబ్లికన్ పార్టీ తరుపున మళ్ళీ బరిలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మద్దతు దారులు నిధుల సేకరణ వేటలో పడ్డారు.

రిపబ్లికన్ నేషనల్ కమిటీమ్, ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ సభ్యులు కలిసి ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సుమారు 125 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 888 కోట్ల పైమాటే సేకరించారు.ఇప్పటి వరకూ ఇలాంటి నిధుల సేకరణ జరగలేదని అమెరికా స్థానిక మీడియా తెలిపింది.

అధ్యక్ష ఎన్నికల్లో ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం ఇదే ప్రధమమని తెలిపింది.ఒబామా హయాంలో ఆయనకీ వచ్చిన నిధులు 497 కోట్లే నని తెలిపింది.ఇదిలాఉంటే

Telugu American, Track, Telugu Nri Ups, Trump-

2019 ఎన్నికల సమయంలో ట్రంప్ తరుపున సేకరించిన నిధుల మొత్తం 2,188 కోట్లని తెలిపారు రిపబ్లికన్ పార్టీ నేతలు.అయితే ఈ మొత్తంలో సగం బ్యాంకులో నిల్వ ఉన్నట్లుగా రిపబ్లికన్లు తెలిపారు.ట్రంప్ మరో మారు అధ్యక్షుడిగా గెలవడానికి ఈ నిధులు ఉపయోగిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.కేవలం డెమొక్రాట్లకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికే 8 మిలియన్ డాలర్లు ఖర్చు చెయనున్నట్లుగా పార్టీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube