కృత్రిమ రక్తాన్ని తయారు చేసి 6 కుందేళ్ల కు ప్రాణం పోసిన జపాన్ శాస్త్రవేత్తలు

కృత్రిమ రక్తం తయారు చేయడం ఏంటి,కుందేళ్ల కు ప్రాణం పోయడం ఏంటి అని అనుకుంటున్నారా.అసలు విషయం ఏమిటంటే ఎవరైనా ప్రమాదం లో అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు తప్పకుండా వారి గ్రూప్ తెలుసుకొని అదే గ్రూప్ ఉన్న రక్తాన్ని అందించడమో లేదంటే యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అయిన o’-ve ఉన్న రక్తం గనుక అందుబాటులో ఉంటే అన్ని గ్రూప్ లకు సరిపోతుండడం తో ఆ రక్తాన్ని అందించడమో చేస్తూ ఉంటాం.

 Japanscientists Made Artificial Blood In Thelabaratory-TeluguStop.com

ముఖ్యంగా రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ సమస్యలు ఉన్నవారికి ఈ రక్తం అందించడం అనేది తప్పనిసరి.అయితే అన్ని వేళలా ఈ రకరకాల గ్రూప్ రక్తాలు అందుబాటులో లేక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు కూడా.

అయితే అలాంటి సమస్య కలగకుండా ఉండాలని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల తొకోరోజవా నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్‌లో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు.సాధారణ రక్తం తరహాలోనే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్ర రక్త కణాలను, చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్‌ ఉన్నాయి.

అయితే ఈ కృత్రిమ రక్తం ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు.అయితే వీటిలో ఆరు ప్రాణాలతో ఉండగా నాలుగు మాత్రం చనిపోయినట్లు తెలుస్తుంది.

అయితే కుందేళ్ల ప్రాణం నిలిపిన ఈ కృత్రిమ రక్తం మనుషులకు సైతం మేలు చేస్తుందని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మరో విశేషం ఏమిటంటే దాతల రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను అటూ ఇటూ కదపడం ద్వారా కేవలం 4 రోజులు మాత్రమే నిలవ ఉంచగలం.

అలాగే, రక్తాన్ని తక్కువ ఉష్ణోగ్రతల్లో నిలువ చేసినా కూడా 20 రోజుల్లో దాని స్వభావం మారిపోతుంది.అయితే, శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కృత్రిమ రక్తం మాత్రం ఏడాదిపాటు నిలువ ఉంటుందని తెలుపుతున్నారు.

Telugu Artificial, Japan, Telugu Ups-

ఈ రక్తాన్ని ఎక్కించిన తర్వాత కుందేళ్లలో ఎలాంటి సైట్ ఎఫెక్ట్‌లు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ రక్తం మనుషులపై కూడా సక్రమంగా పనిచేస్తే.ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు నిలుస్తాయని చెప్పాలి.ఇప్పటికే సమయానికి బ్లడ్ అందక, డోనర్స్ దొరక్క ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.అలాంటి పరిస్థితులలో ఉన్న వారికి ఈ కృత్రిమ రక్తం అనేది చాలా ఉపయోగపడుతుంది.ఇది కూడా యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ గానే పని చేస్తుండడం తో ఎవరికైనా ఈ రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడవచ్చు అన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube