అయ్యయ్యో బల్లాల దేవుడికి ఏమైంది!

‘బాహుబలి’ ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటే అందులో నటించిన నటులలో ఇద్దరే ఇద్దరు ముందుగా గుర్తుకు వస్తారు.వారే ప్రభాస్,దగ్గుబాటి రానా.

 Rana Leanlook Goesviral In Sm-TeluguStop.com

బాహుబలి లో బాహుబలి గా ప్రభాస్ ఎంత పేరు సంపాదించాడో, అలానే ఆ చిత్రంలో విలన్ గా బల్లాల దేవుడి పాత్రలో నటించిన రానా కి కూడా అదే రేంజ్ లో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.ఈ చిత్రం తరువాత రానా క్రేజ్ మరింత పెరిగి హీరోగానే,విలన్ గాను తానేంటో నిరూపించుకోవడం తో అవకాశాలు కూడా బాగానే అందిపుచ్చుకున్నాడు.

అయితే అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఆయన కొంచం అనారోగ్యం పాలైనట్లు వార్తలు హల్ చల్ చేశాయి.అయితే ఆ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్న విషయం తెలియదు కానీ తాజాగా ఆయన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నిజంగా ఆ ఫోటో చూస్తే మాత్రం తప్పకుండా ఎవరైనా అయ్యయ్యో రానా కి ఏమైంది అంటూ ఆశ్చర్యపోవాల్సిందే.ఎన్ఠీఆర్ కధానాయకుడు లో నటించిన రానా ఆ తరువాత కనిపించడం మానేశారు.

గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం తో మూవీలకు దూరంగా ఉన్నారు.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ క్రమంలో విదేశాల్లో కిడ్నీ ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నట్టు ప్రచారం కూడా జోరుగా సాగింది.

అయితే ఎప్పటికప్పుడు తాను ఆరోగ్యంగానే ఉన్ననంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టేవారు.అయితే తాజాగా రానా పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Telugu Baahubali Rana, Ballala Deva, Rana Lean, Telugu Ups-

ఆ ఫోటో లో రానా ని చూస్తే మాత్రం ఈయన నిజంగా బల్లాల దేవుడేనా అని అవాక్కవ్వక మానరు.కండలు తిరిగిన వీరుడిగా బాహుబలి లో కనిపించిన రానా ఈ ఫోటో లో మాత్రం బక్కచిక్కి పోయి ఉండడం విశేషం.ఈ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది.ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరూ కూడా రానా కి ఏమైంది అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

అసలు రానా ఆరోగ్య సమస్య వల్ల అలా మారిపోయాడా లేదంటే మరేదైనా కారణం ఉందా అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube