వణుకుతున్న అమెరికా...!!!

అమెరికాలో మంచు తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది.ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకి పడిపోయాయి.

 America In Deepwinterseason-TeluguStop.com

దాంతో మధ్య ఈశాన్య రాష్ట్రాలలో అనేక ఇళ్ళలో వ్యాపార సంభందిత పనులు చేసుకునే వారికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మంచుతో కురుస్తున్న వర్షంతో ప్రజలు బయటకి రావడానికి భయపడే పరిస్థతి నెలకొంది.

గతంలో కంటే కూడా ప్రస్తుతం వస్తున్న మంచు వర్షం తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తోందని అంటోంది స్థానిక మీడియా.

Telugu American Season, Telugu Nri Ups, Season-

ఉత్తర అమెరికా రాఖీ పర్వత ప్రాంతాలని సైతం మంచు దుప్పటిలా కప్పేసింది.దాంతో పశ్చిమ మోంటానాలో మూడు అడుగుల మేర మంచు రోడ్లపై పేరుకు పోయింది.ఉత్తర ఇడాహో ,ఈశాన్య వాషింగ్టన్ లపై ఈ ప్రభావం అత్యధికంగా ఉందని తెలుస్తోంది.

రోడ్లపై మంచు కుప్పలుగా పేరుకుపోవడంతో ప్రజలు ప్రయాణాలు చేయలేక ఎన్ని అవస్థలు పడుతున్నారు.

మంచు ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలలో స్కూల్స్ కాలీజీలకి సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రజలకి నిత్య సదుపాయాలు అందని పరిస్థితి నెలకొంది.దాంతో పాటు విద్యుత్ కూడా లేకపోవడంతో ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

దాంతో మంచు ప్రభావం కొంత మేర తగ్గిన తరువాత సహాయక చర్యలు చేపడుతామని స్థానిక అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube