ఆ హీరో అంటే పిచ్చి అని మనసులో మాటను బయటపెట్టిన రకుల్

నిజంగా స్టార్స్ అయినా సామాన్యులకు అయినా నటీనటుల పై అభిమానం పెంచుకుంటూ ఉంటారు.అందరికి ఒక్కరే నచ్చాలని ఉండదు.

 Rakul Preet Says How Much Like On Vijaydevara Konda-TeluguStop.com

కొన్ని కొన్ని కోణాల్లో ఒక్కొక్కరి కి ఒక్కొక్క నటుడు అంటే ఇష్టపడుతూ ఉంటారు.అదే ఫస్ట్ క్రష్,ఫస్ట్ లవ్ వంటివి అన్నమాట.

అయితే ఇది కేవలం అభిమానులలో ప్రేక్షకులకో మాత్రమే సొంతం అనుకుంటే తప్పే.ఈ క్రష్ టాప్ హీరో,హీరోయిన్స్ కు కూడా ఉంటుంది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పింది.ఇంతకి ఆ హీరో ఎవరు అని తెలుసుకుంటే మాత్రం మీరు ఆశ్చర్యపోవాల్సిందే.

ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే టాలీవుడ్ అర్జున్ రెడ్డి.అదే నండీ మన విజయ్ దేవరకొండ.

తనకు విజయ్ అంటే చాలా పిచ్చి అన్నట్లు రకుల్ తన మనసులో మాటను బయటపెట్టింది.తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో స్టార్టయిన ఫిల్మ్ జర్నీలో ఇప్పటివరకు చాల మంది హీరోలతో కలిసి నటించింది రకుల్.

అయితే ఇంతవరకు తన మదిలో దాగున్న మాటలను ఒక్కసారైన బయటపెట్టని ఈ ముద్దు గుమ్మ మంచు లక్ష్మి చేస్తున్న లేటెస్ట్ టాక్ ‌షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కార్యక్రమంలో గెస్ట్‌గా వచ్చి తన ఇన్నర్ ఫీలింగ్‌ని ఇంతకాలానికి బయటపెట్టిందట.నీకు సెలబ్రిటీల్లో ఎవరైనా క్రష్ ఉన్నారా? లక్ష్మి ప్రశ్నించగా దానికి రకుల్ సమాధానం గా విజయ్ పేరు చెప్పి ఆశ్చర్యానికి గురిచేసింది.వాస్తవానికి చెప్పాలి అంటే విజయ్ కంటే కూడా టాలీవుడ్ లో రకుల్ ముందుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.అలాంటి రకుల్ కు విజయ్ మీద క్రష్ అని చెప్పేసరికి మంచు వారి అమ్మాయి ఆశ్చర్యపోయింది.

ఎవరైన ఒక హీరోకి తనకు నచ్చిన హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలని, లేక వారితో కలిసి నటించాలని ఆశపడటం సహజంగానే ఉంటుంది.ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణమే.అలానే రకుల్ కు కూడా విజయ్ తో నటించాలని ఉన్నట్లుగా చెప్పకనే చెప్పింది అన్నమాట.

Telugu Manmadhudu, Nagarjuna, Rakul, Rakulpreeth, Tollywood Box-

  అయినా అర్జున్ రెడ్డి గారు తన సినిమా లో లిప్ లాక్ లు లేకుండా చేయరు మరి ఆ లిప్ లాక్ లకు కూడా ఈ అమ్మడు సిద్ధంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది.ప్రస్తుతం రకుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్‌లో మర్జవా చిత్రంలో నటిస్తున్నారు.ఆమెతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, రితేశ్ దేశముఖ్, తారా సుతారియా కూడా ఈమూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదలై సంచలనం రేపుతోంది.ఈ మూవీలో రకుల్ ఓ స్పెషల్ సాంగ్ డాన్స్ చేస్తూ కనిపించింది.R

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube