సబ్‌మెరైన్‌లో డ్రగ్స్: వెంబడించి పట్టుకున్న యూఎస్ కోస్ట్‌గార్డ్

అమెరికా కోస్ట్ గార్డ్ మాదక ద్రవ్యాలతో వెళుతున్న సబ్‌మెరైన్‌ను పట్టుకుంది.సుమారు 12 వేల పౌండ్ల బరువున్న ఈ డ్రగ్స్ విలువ అమెరికా కరెన్సీలో 165 మిలియన్ డాలర్లు ఉంటుందని అధికారులు తెలిపారు.40 అడుగుల పొడవుతో ఉన్న ఈ సబ్‌మెరైన్ పెట్రోల్, గ్యాస్ సాయంతో నడుస్తుంది.

 Us Cost Guards Catches Unknown Submariner In Us-TeluguStop.com

Telugu Drugs, Submarine, Telugu Nri Ups-

  దీని జాడను సెప్టెంబర్ మొదటిలోనే అమెరికా మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ పసిఫిక్ జలాల్లో కనుగొంది.అనంతరం కోస్ట్‌గార్డ్‌లోని వాలియంట్ క్రూ సిబ్బందికి సమాచారం అందించడంతో కొలంబియా నౌకాదళం సాయంతో యూఎస్ కోస్ట్ గార్డ్ సౌత్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది.

Telugu Drugs, Submarine, Telugu Nri Ups-

 

మంగళవారం తెల్లవారుజామున కొద్దిసేపు వెంబడించిన అనంతరం అంతర్జాతీయ జలాల్లో సబ్‌మెరైన్‌ను కోస్ట్‌గార్డ్ సిబ్బంది చుట్టుముట్టారు.అందులోని డ్రగ్స్‌ను సీజ్ చేయడంతో పాటు నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.కొలంబియా-అమెరికా నౌక దళాల సాయంతో స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని, తద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయని యూఎస్ కోస్ట్‌గార్డ్ ట్వీట్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube