పాకిస్తాన్‌కు భారత రక్షణ శాఖ సీరియస్‌ వార్నింగ్‌

పాకిస్తాన్‌పై మరోసారి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్‌ చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన హెచ్చరించాడు.1965 మరియు 1971 తప్పులు పునరావృతం అయితే ఈసారి పాకిస్తాన్‌ తేరుకోకుండా అవుతుందని, పాకిస్తాన్‌లో వ్యతిరేకత మొదలయ్యి రెండు దేశాలుగా విడిపోయే అవకాశాలు లేకపోలేదు అంటూ రాజ్‌నాధ్‌ సింగ్‌ హెచ్చరించారు.పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో కూడా మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 Rajnath Singh Give The Warning Topakistan-TeluguStop.com

సొంత గడ్డపై పాకిస్తాన్‌ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది.ఇదే కనుక ముదిరితే పాకిస్థాన్‌లో రెండు ప్రాంతాలు కూడా విడిపోయేందుకు పోరాటం చేస్తాయంటూ హెచ్చరించాడు.భారత్‌తో పెట్టుకుంటే పాకిస్తాన్‌కు ఏం జరుగబోతుందో ఇప్పటికే అర్థం అయ్యిందని ఆయన అన్నాడు.పాకిస్తాన్‌ స్థానికులను ప్రోత్సహించి ఉగ్రవాదులుగా మల్చి ఇండియాకు పంపిస్తున్నట్లుగా రాజ్‌ నాధ్‌ సింగ్‌ విమర్శించాడు.

ఇండియాలో ఉగ్రవాది అయిన వ్యక్తి పాకిస్తాన్‌లో స్వాతంత్య్ర సమరయోధుడిగా పిలవబడుతున్నాడు అంటూ రాజ్‌నాధ్‌ సింగ్‌ ఆరోపించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube