IIFA అవార్డ్స్ లో అనుకోని అతిధి,ఫిదా అవుతున్న నెటిజన్లు

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక వీడియో హల్ చల్ చేస్తుంది.ఇంతకీ ఆ వీడియో ఎక్కడిది అంటే ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA) 2019-20 వేడుకలు ముగిసిన విషయం తెలిసిందే.

 Dogcame To 2019 Iifa Awards Function Video-TeluguStop.com

అయితే ఈ వేడుకలకు పలువురు సెలబ్రిటీలు హాజరు కాగా,వారి తో పాటు ఈ వేడుకకు ఒక కుక్క కూడా వెళ్లింది.నిజానికి ఆ ఫంక్షన్‌లో చాలా సెక్యూరిటీ ఉంటుంది.

అయినప్పటికీ ఆ సెక్యూరిటీ మొత్తాన్ని కూడా దాటుకొని అక్కడకు ఆ డాగ్ వెళ్లడం విశేషం.అయితే ఆ డాగ్ ని చూసిన నటి అదితి భాటియా దానిని కూడా ఇంటర్వ్యూ చేసింది.హాయ్… ఇక్కడకు అనుకోని అతిథి వచ్చింది తనను ఇంటర్వ్యూ చేసి బోలెడు విషయాలు తెలుసుకుందాం అంటూ అదితి భాటియా కుక్కను రకరకాల ప్రశ్నలు అడిగింది.అయితే ఆ కుక్క కూడా వాటికి సమాధానంగా తన ముందు రెండు కాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చింది.

ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

కేవలం రెండు రోజుల్లోనే ఈ వీడియోని ఏడు లక్షల మందికి పైగా చూశారంటే ఇది ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అన్న విషయం అర్ధమౌతుంది.

ఆ వీడియో లో అదితి చెబుతున్నది వింటూ ఆ కుక్క ఎంతో పద్ధతిగా ఉండటాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube