మళ్లీ తన ఆత్మహత్య యత్నం విషయాన్ని చెప్పుకొచ్చిన పవన్‌

చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక నిన్న ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరిగింది.పవన్‌ కళ్యాణ్‌, రాజమౌళి, వివి వినాయక్‌ మరియు కొరటాల శివలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు.

 Pawan Kalyancomments On Saira Narasimha Reddy-TeluguStop.com

ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు.ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం వల్ల స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Pawankalyan-

  అన్నయ్య నాకు చిన్నప్పటి నుండి ఎంకరేజ్‌మెంట్‌ ఇస్తూ వచ్చారు.ఆయన మోటివేషన్‌ కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను.ఇటీవల ఇంటర్‌ పిల్లలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చినప్పుడు చాలా బాధ వేసింది.ఆ సమయంలో నేను కూడా ఇంటర్‌ ఫెయిల్‌ అయినప్పుడు అన్నయ్య గన్‌తో కాల్చుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.

అప్పుడు వదిన నన్ను అన్నయ్య వద్దకు తీసుకు వెళ్లింది.ఆ సమయంలో అన్నయ్య నాకు ఇచ్చిన భరోసాను జీవితంలో ఎప్పటికి మర్చి పోలేను అంటూ పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చాడు.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Pawankalyan-

  ప్రతి సారి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, గన్‌తో కాల్చుకోవాలనుకున్నాను అంటూ పవన్‌ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.పవన్‌ వ్యాఖ్యలను కొందరు ట్రోల్స్‌ కూడా చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో పవన్‌ గురించి ఇష్టానుసారంగా కామెంట్స్‌ చేస్తున్నారు.ఆత్మహత్య చేసుకోబోయాను అంటూ పదే పదే గొప్పగా చెప్పుకోవడం నీకే చెల్లింది పవన్‌ అంటూ కామెడీ చేస్తున్నారు.

పిల్లలకు మంచి చెప్పాల్సింది పోయి నేను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను, ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యాను అనే మాటలు పదే పదే చెప్పడం కరెక్ట్‌ కాదంటున్నారు.సైరా వేడుకలో కాకుండా అంతకు ముందు పలు సందర్బాల్లో పవన్‌ ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube