ట్రక్కు‌లో 53 మంది అక్రమ వలసదారులు: షాకైన అధికారులు

అమెరికా-మెక్సికో సరిహద్దుల వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.దానికి తోడు అక్రమ వలసదారులకు దేశంలో చోటు లేదని అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కఠిన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు.

 53 Illegal Immigrants Found Inside Sweltering Tractor Trailer In Texas Telugu N-TeluguStop.com

అయితే కొందరు అమెరికా పౌరులే అక్రమ వలసదారులకు సహకరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో ఓ ట్రక్కు డ్రైవర్ సుమారు 53 మంది అక్రమ వలసదారులను సరిహద్దుల నుంచి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

Telugu Trailer, Telugu Nri Ups-

  వివరాల్లోకి వెళితే.టెక్సాస్ రాష్ట్రం లారేడో నగరంలోని 35వ నెంబర్ అంతర్రాష్ట్ర సరిహద్దు గుండా ఒక ట్రక్కు వెళుతోంది.ఆ సమయంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ చెక్‌పోస్ట్ వద్ద అధికారులు ఆ వాహనాన్ని తనిఖీ చేశారు.డ్రైవర్ తప్పించి అక్కడ ఏది వారికి అనుమానాస్పదంగా కనిపించలేదు.

అయితే డాగ్ స్వ్కాడ్‌కు లోపల మనుషులు, మాదక ద్రవ్యాల వాసన రావడంతో పదే పదే గర్జించడంతో పాటు ట్రక్కు చుట్టూ అదే పనిగా తిరిగాయి.

Telugu Trailer, Telugu Nri Ups-

  దీంతో అధికారులకు అనుమానం కలిగి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.ట్రక్కు లోపలి భాగాన్ని తీసి చూడగా ఇరుక్కుని కూర్చొన్న జనం కనిపించారు.వీరంతా కూడా మెక్సికో, ఈక్వేడార్, గ్వాటెమాలా, ఈఐ సాల్వాడర్‌, హోండూరాస్‌‌కు చెందిన అక్రమ వలసదారులుగా గుర్తించారు.

ట్రక్కు డ్రైవర్‌తో పాటు 53 మందిని అధికారులు అదుపులోకి తీసుకుని హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగానికి కేసును అప్పగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube