అమెరికాలో మహిళా ఎన్నారై దాతృత్వం..!!!

అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలుగు సంఘం తానా.ఈ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతీ సేవా కార్యక్రమాలు ఎంతోమందికి మార్గ దర్సకంగా ఉంటాయి.

 Nri Women Paladugu Sirisha Donate 15k Dollars Tana For Poor Nri People-TeluguStop.com

అమెరికాలో తెలుగు వారికి ఎక్కడ ప్రమాదం జరిగినా సరే సత్వరమే సేవలు అందించడానికి తానా టీం స్క్వేర్ విభాగాన్ని ప్రారంభించింది.ఈ విభాగం ఇప్పటికే ఎంతో మంది ప్రమాదంలో గాయాల పాలైన, లేదా మరణించిన తెలుగు వారికి ఆసరాగా నిలిచింది.అయితే

Telugu Nripaladugu, Paladugusirisha, Tana, Telugu Nri Ups-

 

ప్రమాదవశాత్తు అమెరికాలో మరణించిన వారి మృతదేహాలని భారత్ తరలించి అక్కడి నుంచీ వారి వారి ప్రాంతాలకి తరలించడానికి ఉండే ప్రక్రియ మొత్తాన్ని తానా టీంస్క్వేర్ దగ్గరుండి చూసుకుంటుంది.ఈ క్రమంలోనే తానా చేస్తున్న ఈ సేవని గుర్తించిన అమెరికాలోని ఓ మహిళ ఎన్నారై టీంస్క్వేర్ విభాగానికి 15 వేల డాలర్ల విరాళం ప్రకటించారు.ఇండియన్ కరెన్సీలో అది మొత్తం 10 లక్షల పైమాటే.

పాలడుగు శిరీష కి తానా టీంస్క్వేర్ చేసే ఈ కార్యక్రమం ఎంతగానో నచ్చిందని.

మరింత మందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభాగా ఉండేలా తానూ ఈ డబ్బుని విరాళంగా ఇచ్చానని ఆమె తెలిపారు.విమానాశ్రయం నుంచీ స్వస్థలాలకి మృత దేహాలు తరలించేందుకు ఈ సొమ్ముని వాడాలని ఆమె కోరినట్టుగా టీంస్క్వేర్ విభాగం చైర్మెన్ కొల్లా అశోక్ బాబు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube