నెహ్రూ వల్లే అసలు సమస్య

ప్రస్తుతం కశ్మీర్‌లో సమస్యలకు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఏర్పాటు అవ్వడానికి ప్రధాన కారణం అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ అంటూ బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా అభిప్రాయం వ్యక్తం చేశాడు.1947వ సంవత్సరంలో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం వల్లే పాకిస్తాన్‌ అడ్డగోలుగా ప్రవర్తించింది.ఆ సమయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఇండియా కాల్పుల ఒప్పంద నిర్ణయం తీసుకోవడం అవివేకం అంటూ అమిత్‌ షా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.నెహ్రూ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రస్తుతం దేశం మొత్తం ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని అన్నాడు.

 Bjpchief Amit Shah Says Jawaharlal Nehru Was The Main Reason For The Creation O-TeluguStop.com

ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి సంస్థానాల విలీన సమయంలో పటేల్‌ సరైన వ్యూహాలతో అడుగులు వేశారు.దేశంలోని అన్ని సంస్థనాలను పటేల్‌ సమగ్రంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విలీనం చేయగలిగారు.

కాని కాశ్మీర్‌ విషయాన్ని పర్యవేక్షించిన నెహ్రూ మాత్రం ఆ విషయంలో విఫలం అయ్యారు.నెహ్రూ విఫలం అవ్వడంతో కాశ్మీర్‌ విషయం ఇప్పటికి రావణ కాష్టం మాదిరిగానే కాలుతూనే ఉందని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు.

ప్రస్తుతం దేశంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నాయని, కశ్మీర్‌ అంశంలో కూడా దేశ ప్రజలు అంతా కూడా సంతోషించేలా జరుగుతుందని అమిత్‌ షా అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube